Advertisementt

దేవికి 'సారీ' చెప్పిన వెంకీ అట్లూరి

Thu 25th Mar 2021 09:28 AM
rang de movie,venky atluri,devi sri prasad,nithin rang de movie,rang de review,rang de grand release event  దేవికి 'సారీ' చెప్పిన వెంకీ అట్లూరి
Rang De grand release event దేవికి 'సారీ' చెప్పిన వెంకీ అట్లూరి
Advertisement
Ads by CJ

రంగ్ దే గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ లో రంగ్ దే డైరెక్టర్ వెంకీ అట్లూరి మట్లాడుతూ..

రాజ‌మండ్రికి నాకు అనుబంధం వుంది. ఫ‌స్ట్ టైమ్ ఈవెంట్ ఇక్క‌డ జ‌ర‌గ‌డం..చాలా ఆనందంగా వుంది. బేసిగ్గా ల‌వ్‌స్టోరీసే చేయాల‌న్న‌ది నా అభిమ‌తం కాదు. జ‌స్ట్ ఇది యాదృచ్ఛికంగా జ‌రిగింది. రంగ్ దే అనేది ఇద్ద‌రు వ్య‌క్తుల ప్రేమ‌క‌థ మాత్ర‌మే కాదు. రంగ్ దే అని పెట్ట‌డానికి కార‌ణం ఏంటంటే హోళీ ఆడితే ర‌క‌ర‌కాల క‌ల‌ర్ల‌ని ఒకేసారి ముఖం మీద కొడ‌తాం. అలాగే ఈ సినిమాలో కూడా ర‌క‌ర‌కాల ఎమోష‌న్స్ ఒక స్ప్లా‌ష్ కింద వ‌స్తే ఎంత హ్యాపీగా ఫీల‌వుతామో అంత చ‌క్క‌గా వుంటుందీ సినిమా. ప్రామిస్‌గా చెబుతున్నాను.. నితిన్‌గారు కామెడీ నిజంగా అద‌ర‌గొట్టేశారు. కీర్తిగారిని ఎంత ఏడిపిస్తారో.. త‌రువాత ఆమె అంత ప‌గ తీర్చుకుంటారు. ఈవిడ మామూలు మ‌నిషి కాదు. ఖ‌చ్చితంగా ఈ సినిమా మిమ్మ‌ల్ని ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. దేవిగారి విష‌యంలో త‌ప్పు చేశాను. అందుకు అంద‌రి ముందు పారీ చెబుతున్నాను. బస్టాండే.. బ‌స్టాండే. పాట ఎంతో పెద్ద హిట్టయింది. అందరికి న‌చ్చింది. అయితే ఈ పాట ముందు విన్న‌ప్పుడు సార్ ఇది అంటూ న‌సిగాను. వెంట‌నే దేవిగారు మీకు మైండ్ వుందా? అని తిట్టి ఈ సాంగ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవుతుంద‌ని ఈ సాంగ్ పెడ‌దాం అని న‌న్ను క‌న్విన్స్ చేశారు. ఆ పాట రిలీజైన ద‌గ్గ‌రి నుంచి మిలియ‌న్స్ వ్యూస్‌ని దాటేస్తోంది. ఈ సంద‌ర్భంగా దేవిగారికి సారీ చెబుతున్నాను.అన్నారు.   ‌ 

Rang De grand release event:

Rang De grand release event

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ