నాగ చైతన్య - సాయి పల్లవి కాంబోలో శేఖర్ కమ్ముల తెరకెక్కుతున్న ప్యూర్ లవ్ స్టోరీ మార్చ్ ఏప్రిల్ 16 న విడుదలకాబోతుంది. లవ్ స్టోరీ నుండి మార్కెట్ లోకి రిలీజ్ అయిన సారంగ దరియా ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చెయ్యగా.. ఇప్పుడు మరో సాంగ్ లవ్ స్టోరీ నుండి విడుదల కాబోతుంది. లవ్ స్టోరి చిత్రంలోని ఏవో ఏవో కలలే సాంగ్ రిలీజ్ చేయనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు. మరో సాంగ్ సెన్సేషన్ కు సిద్ధమవుతోంది లవ్ స్టోరి సినిమా. లవ్ స్టోరి నుంచి రిలీజ్ చేసిన ప్రతి పాట హిట్ కొడుతూ సినిమాపై అటు వ్యాపార వర్గాల్లో ఇటు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతోంది. ఈ చిత్రంలోని మరో పాట విడుదలకు సిద్ధమవుతోంది. లవ్ స్టోరి సినిమాలోని ఏవో ఏవో కలలే పాటను గురువారం ఉదయం 10.08 నిమిషాలకు సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేయబోతున్నారు.
ఈ సాంగ్ పోస్టర్ చూస్తే ..పాటలో అదిరిపోయే స్టెప్పులు ఉంటాయని తెలుస్తోంది. వాన పాట కాబట్టి నాగ చైతన్య, సాయి పల్లవి జంటలో మరింత జోష్ ఖాయం. సారంగ దరియా లో సాయి పల్లవి సోలో స్టెప్స్ చూసిన ఆడియెన్స్ ఈ రెయిన్ డ్యూయెట్ లో చైతూ, సాయి పల్లవి డాన్సులు ఎంజాయ్ చేయబోతున్నారు.