సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన డే వన్ నుండి కూడా అన్నీ.. సినిమావాళ్ళకి ఫెవర్ గా చేస్తున్న సినిమా ఇండస్ట్రీ పెద్ద తల సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ .. ఎప్పుడూ సినిమా ఇండస్ట్రీ నుండి ఏదైనా సమస్యతో వెళ్లినా, లేదంటే సినిమావాళ్ళకి ఎలాంటి సహాయం కావాలన్నా ముందుగా నేనున్నాను అంటూ సినిమా వాళ్ళను ఆదుకోవడంలో ఆయన ముందుంటారు. ఇప్పుడు కూడా గత రెండు రోజులుగా కరోనా కేసులు పెరిగిపోవడంతో.. థియేటర్స్ మూత బడతాయి.. మరోసారి సినిమాల రిలీజ్ వాయిదా పడతాయి అంటూ ప్రచారం జరుగుతుంది. అందులోనూ తెలంగాణ ప్రభుత్వం నిన్న సాయంత్రం విద్యాసంస్థలు మూసివేయాలంటూ ప్రకటన జారీ చెయ్యడంతో మరోసారి థియేటర్స్ మూత బడడం ఖాయమనే ఫిక్స్ అవుతున్నారు.
కానీ ఈ రోజు సీనియామాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్.. థియేటర్స్ మూతబడతాయి అనే వార్తలు నమ్మకండి, అవన్నీకేవలం రూమర్స్ మాత్రమే. కనోనా సమయంలో సినిమా ఇండస్ట్రీ బాగా నష్టపోయిందని. సినిమా వాళ్ల అవసరాల్ని తెలుసుకుని.. వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని.. థియేటర్స్ మూసేయ్యం, కరోనా నిబంధనలు పాటిస్తూ.. థియేటర్స్ రన్ చేసుకోవచ్చు అంటూ హామీ ఇచ్చారు. తలసాని ఇలా ప్రకటన చెయ్యడంతో సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. లేదంటే మరోసారి చిత్ర సీమ కష్టాల్లోకి వెళ్లబోతుంది అంటూ అందరూ తెగ ఫీలవుతున్నారు.