Advertisementt

బావమరిది సినిమాకి క్లాప్ కొట్టనున్న తారక్

Wed 24th Mar 2021 12:45 PM
jr ntr,brother in law,nithin narne,teja,director teja,chitram sequel,chitram movie,debut hero nithin  బావమరిది సినిమాకి క్లాప్ కొట్టనున్న తారక్
Jr NTR Brother-in-law Nithin Entry into Movies బావమరిది సినిమాకి క్లాప్ కొట్టనున్న తారక్
Advertisement
Ads by CJ

తారక్ బావమరిది నార్నె నితిన్ హీరోగా ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నాడనే విషయం తెలిసిందే. దర్శకుడు తేజ దగ్గర కొన్నాళ్లుగా యాక్టింగ్ క్లాస్ లకి హాజరవుతున్న నితిన్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చెయ్యబోది కూడా తేజనేనట. అది కూడా ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం తేజ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం మూవీ కి సీక్వెల్ గా రాబోతున్న చిత్రం 2 మూవీ ద్వారానే నితిన్ హీరోగా మారబోతున్నాడని సమాచారం. తేజ - నితిన్ కాంబోలో చిత్రం 2 మూవీ గ్రాండ్ గా ఏప్రిల్ 18 న లాంచ్ అవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది.

అయితే తన బావమరిది హీరోగా పరిచయమవుతున్న మూవీ కాబట్టి తారక్ ఈ మూవీ ఓపెనింగ్ కి గెస్ట్ గా రాబోతున్నాడట. అంతేకాకుండా ఎన్టీఆర్ తో పాటుగా సినిమా ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులు ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారట. ఎన్టీఆర్ క్లాప్ తో బావమరిది నితిన్ సినిమా మొదలు కాబితుంది. తేజ దగ్గరే నటనలో మెళుకువలు నేర్చుకుని తేజ దర్శకత్వంలో హీరోగా లాంచ్ అవుతున్న బావమరిది నితిన్ ని చూసి ఎన్టీఆర్ కూడా హ్యాపీగా ఉన్నాడట.

Jr NTR Brother-in-law Nithin Entry into Movies:

Jr NTR Brother In Law Nithin Narne To Debut Hero

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ