జనవరిలో సంక్రాంతికి 50 పర్సెంట్ అక్యుపెన్సీతో క్రాక్ సినిమా వసూళ్లు రాబట్టడంలో ధైర్యం చేసిన నిర్మాతలు ఆ నెలాఖరు నుండి తమ సినిమా రిలీజ్ డేట్స్ వరసబెట్టి అనౌన్స్ చేసారు. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ డేట్ ఇవ్వగానే మిగతా నిర్మాతలు, హీరోలు లైన్ లో కొచ్చేసారు. భారీ బడ్జెట్ మూవీస్, లో బడ్జెట్, మీడియం బడ్జెట్ మూవీస్ నిర్మాతలు ఒకరు తర్వాత మరొకరు పోటీ పడి మరీ తమ సినిమాల రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేసేసారు. ఒక్కో నెలలో ఒక్కో భారీ బడ్జెట్ సినిమా ఉండేలా ప్లాన్ చేసారు. గత ఏడాది రిలీజ్ కాకుండా ఆగిన సినిమాలన్నీ ఫిబ్రవరి, మార్చ్ లలో విడుదలైపోయాయి. ఇక ఏప్రిల్ 9 వకీల్ సాబ్ దగ్గరనుండి పెద్ద సినిమాల మోత మొదలవుతుంది. ఫస్ట్ డే కలెక్షన్స్, బాక్సాఫీసు లెక్కలు ఇలా సోషల్ మీడియాలో మోతమోగిపోవడం ఖాయం.
ఎంతో ఉత్సాహంగా డేట్స్ ఎనౌన్స్ చేసేసి కూల్ గా షూటింగ్స్ చేసుకుంటున్న దర్శకనిర్మాతలకు మరోసారి టెంక్షన్ మొదలైంది. గత ఏడాది మార్చ్ 20 నుండి కరోనా కారణంగా లాక్ డౌన్ లో షూటింగ్స్, సినిమా విడుదలలు, థియేటర్స్ అన్ని మూతబడినట్లుగానే ఈ ఏడాది మార్చి 25 నుండి కరోనా ఉధృతి పెరగడంతో.. మరోసారి థియేటర్స్, షూటింగ్స్ కి బ్రేకులు పడబోతున్నాయనే న్యూస్ నిర్మాతల గుండెల్లో గుబులు రేపుతోంది. కరోనా సెకండ్ వెవ్ అంటూ థియేటర్స్ బంద్, షూటింగ్స్ కి బ్రేక్ లు పడితే మరోసారి సినిమాల వాయిదా అనివార్యం అవడం ఖాయంగా ఉంది ప్రెజెంట్ పరిస్థితి.
ఒకవేళ థియేటర్స్ బంద్ లేకపోయినా 100 పర్సెంట్ నుండి 50 పర్సెంట్ అక్యుపెన్సీకి థియేటర్స్ సామర్ధ్యం తగ్గించినా బడా సినిమాల రిలీజ్ లు ఆగిపోవడం ఖాయం. ఏప్రిల్ లో వకీల్ సాబ్, మే లో ఆచార్య, నారప్ప, BB3 ఇలా వరసగా పెద్ద సినిమాలన్నీ రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మరోసారి లాక్ డౌన్ న్యూస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తుంది.