Advertisementt

ఎన్టీఆర్ కి హీరోయిన్ దొరికేసిందా

Tue 23rd Mar 2021 06:37 PM
rashmika mandanna,trivikram,ntr 30,jr ntr,ntr - trivikram movie,ntr - rashmika combo  ఎన్టీఆర్ కి హీరోయిన్ దొరికేసిందా
Rashmika Mandanna to romance Jr NTR ఎన్టీఆర్ కి హీరోయిన్ దొరికేసిందా
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మూవీ వచ్చే నెల అయినా లేదంటే మే నెల నుండి అయినా మొదలు కావొచ్చని ప్రొడ్యూసర్ నాగ వంశి క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ సినిమా కోసం వెయిటింగ్. ఎందుకంటే ఎన్టీఆర్ తాజా చిత్రం ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ కావొస్తుంది. అయితే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ఏకే రీమేక్ విషయంలో కాస్త బిజీగా ఉండడం వలన ఎన్టీఆర్ తో చెయ్యాల్సిన సినిమా లేట్ అవుతుంది. ఇకపోతే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబో హీరోయిన్ విషయంలో ఎప్పటినుండో సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది. త్రివిక్రమ్ మరోసారి పూజ హెగ్డే ని రిపీట్ చేస్తాడంటుంటే.. ఎన్టీఆర్ ససేమిరా అంటున్నాడని వార్తలు వస్తున్నాయి.

మరోపక్క బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఎన్టీఆర్ కి హ్యాండ్ ఇచ్చి చరణ్ సినిమాకి సైన్ చేసినట్లుగా తెలుస్తుంది. మధ్యలో ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో రష్మిక పేరు తెరపైకి వచ్చింది. ఎందుకంటే రష్మిక రెండు రోజుల క్రితం త్రివిక్రమ్ ని కలిసింది. ఆ మీటింగ్ లోనే ఎన్టీఆర్ తో చెయ్యబోయే కథని రష్మిక కి వినిపించడం రష్మిక ఈ సినిమాకి ఓకె చెప్పెయ్యడం జరిగిపోయాయని అంటున్నారు. అంటే త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబో మూవీకి హీరోయిన్ గా రష్మిక ఫిక్స్ అంటూ చాలామంది ఫిక్స్ అవుతున్నారు.

Rashmika Mandanna to romance Jr NTR:

Rashmika Mandanna to romance Jr NTR in Trivikram Movie 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ