Advertisementt

అసలే ఫైర్ బ్రాండ్.. ఇంకెందుకు ఆగుతుంది

Mon 22nd Mar 2021 09:04 PM
kangana ranaut,bags,awards,best actress,panga,manikarnika,67th national film awards  అసలే ఫైర్ బ్రాండ్.. ఇంకెందుకు ఆగుతుంది
67th National Awards: Kangana wins Best Actress అసలే ఫైర్ బ్రాండ్.. ఇంకెందుకు ఆగుతుంది
Advertisement
Ads by CJ

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా పేరు చెబితే కొందరికి వెన్నులో ఒణుకు వచ్చేస్తుంది. శివసేన ప్రభుత్వాన్నే వదలలేదు కంగనా. రాజకీయాల్లో అయినా, సినిమాల విషయంలో అయినా ఫైర్ బ్రాండ్ లా రెచ్చిపోతుంది. స్టార్స్ వారసత్వం విషయంలో టాప్ స్టార్స్ తో యుద్దానికి సిద్దమయ్యే కంగనాతో పెట్టుకుని గెలిచిన వాళ్ళు చాలా తక్కువమంది ఉంటారు. అయితే అంతలాంటి పౌరుషం, అంతలాంటి గర్వం కంగనాకు క్వీన్ సినిమా కి జాతీయ ఉత్తమ అంటి అవార్డు సొంతం చేసుకున్నప్పటినుండి, అలాగే మణికర్ణికా విజయం చూసుకుని రెచ్చిపోతుంది అంటుంటారు. అందరూ అనుకోవడం కాదుగాని.. అవార్డులను ఏకధాటిగా సొంతం చేసుకోవడంలో కంగనా ఫస్ట్ ఉంటుంది. జాతీయ ఉత్తమనటిగా మూడు సార్లు అనగా ఫస్ట్ టైం ఫ్యాషన్ సినిమాకు సహాయ నటి కేటగిరీలో నేషనల్ అవార్డు తీసుకుంది కంగన. తర్వాత క్వీన్, తనూ వెడ్స్ మనూ రిటర్న్స్ సినిమాలకు వరసగా జాతీయ ఉత్తమ నటిగా అవార్డులు సొంతం చేసుకుంది.

ఇప్పుడు లేటెస్ట్ గా 67వ జాతీయ అవార్డుల ప్రకటనలో కంగనా మణికర్ణికా, పంగా సినిమాలకు అవార్డులను సొంతం చేసుకుంది. మణికర్ణికా సినిమాకి గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డు గెలుచుకుంది. అసలు అవార్డుల కేటగిరి ప్రకటిస్తున్నారంటే.. అందులో కంగనా పేరు ఖచ్చితంగా ఉంటుంది అనేది ఆమె ఫాన్స్ కి ముందే తెలిసిపోతుంది. నటిగా తన టాలెంట్ ఏంటో చూపించిన కంగనా మణికర్ణిక విషయంలో దర్శకుడు క్రిష్ తో విభేదాలు రావడంతో కొంతమేర ఆమె మణికర్ణికా సినిమాని డైరెక్ట్ కూడా చేసింది. ఇప్పటికే తన పదునైన మాటలతో రెచ్చిపోయే కంగానికి ఇలా వరస అవార్డ్స్ రావడం చూస్తే ఆమె ఇంకెందుకు ఆగుతుంది.. మరింతగా రెచ్చిపోవడం ఖాయం అంటున్నారు.

67th National Awards: Kangana wins Best Actress:

Kangana Ranaut bags the award for best actress at the 67th National Film Awards

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ