Advertisementt

రోజా కి ఫాన్ ని అంటున్న నాగబాబు

Mon 22nd Mar 2021 05:52 PM
jabardasth,nagababu,mla roja,sensational comments,roja  రోజా కి ఫాన్ ని అంటున్న నాగబాబు
Nagababu Comments On Roja రోజా కి ఫాన్ ని అంటున్న నాగబాబు
Advertisement
Ads by CJ

ఒకప్పుడు జబర్దస్త్ జెడ్జిస్ గా ఉన్న నాగబాబు - రోజాలు ఇప్పుడు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. వేరే వేరే పొలిటికల్ పార్టీలలో ఉన్నప్పటికీ.. జబర్దస్త్ స్టేజ్ మీద ఇద్దరూ స్నేహంగానే కనిపించేవారు. జబర్దస్త్ మొదలైంది మొదలు నాగబాబు - రోజా జేడ్జ్మెంట్ కి చాలామంది ఫాన్స్ అయ్యారు. మధ్యలో వాళ్లలో ఎవరైనా బ్రేక్ తీసుకున్న గెస్ట్ జెడ్జెస్ తో సీట్ షేర్ చేసుకునేవారు. అయితే నాగబాబు మొన్నామధ్యన మల్లెమాల వాళ్లతో వచ్చిన విభేదాల వలన జబర్దస్త్ నుండి బయటికి వెళ్ళిపోయాడు కానీ రోజా ఇంకా జబర్దస్త్ జేడ్జ్ గానే కొనసాగుతుంది. పొలిటికల్ గా ఎంతగా బిజీగా ఉన్నా రోజా తన జేడ్జ్ సీటుని వదలడం లేదు.

జబర్దస్త్ నుండి వెళ్లిపోయిన నాగబాబు మరో చానల్లో కామెడీ షో కి జేడ్జ్ గా చేసినా అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. దానితో ఓ యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టిన నాగబాబు ప్రెజెంట్ వెండితెర మీద విలన్ కేరెక్టర్స్ కోసం కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. తాజాగా సోషల్ మీడియాలో లైవ్ లో ఫాన్స్ తో మాట్లాడిన నాగబాబు ని మీకు జబర్దస్త్ లో ఎవరంటే ఇష్టం అని అడిగితే.. ఏ హైపర్ ఆది పేరో, లేదంటే సుడిగాలి సుధీర్ పేరో చెబుతాడనుకుంటే.. నాకు రోజా అంటే ఇష్టం అని పెద్ద షాక్ ఇచ్చాడు. కారణం రోజా కూడా పంచ్ లు బాగా పేలుస్తుంది. కమెడియన్స్ స్టేజ్ మీద వేసే పంచ్ లకు రోజా వేసే కౌంటర్ పంచ్ లు అంటే తనకి చాలా ఇష్టం అని, రాజకీయంగా మా మధ్యన విభేదాలున్నా.. వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవంటూనే.. రోజా పంచ్ లకి తాను ఫాన్ అంటూ చెప్పుకొచ్చాడు.

Nagababu Comments On Roja:

Jabardasth Nagababu sensational Comments On Roja

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ