నవీన్ పోలిశెట్టి.. ఇప్పుడు యూత్ లో నానుతున్న మాట. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ హిట్ అయినా రాని పేరు.. జాతి రత్నాలకు వచ్చేసింది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అది మంచి హిట్. కానీ జాతి రత్నాల అంత హిట్ కాదు. అయితే జాతి రత్నాలతో బాగా ఫెమస్ అయిన నవీన్ పోలిశెట్టి.. ఆ సినిమాకి చేసిన ప్రమోషన్స్ వేరే లెవల్ లో ఉన్నాయి. అలా ప్రేక్షకుల్లో బాగా రీచ్ అయిన ఆ సినిమా నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. దానితో నవీన్ పోలిశెట్టి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇంకేముంది.. నవీన్ పారితోషకం లెక్కలు మారిపోయాయి.
ఒక్కదెబ్బకి ఫెముకి ఫెము, క్రేజు కి క్రేజ్ నవీన్ సొంతం అయ్యాయి. ఇక నవీన్ సుడి ఏ రేంజ్ లో అంటే ఒక్కసారిగా డబుల్ కాదు త్రిబుల్ పారితోషకానికి ఎదిగిపోయాడు. జాతి రత్నాల హిట్ చూసిన బడా నిర్మాణ సంస్థలు నవీన్ కోసం క్యూ కట్టాయి. ముందు అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసుకునే పనిలో పడ్డాయి. అందులో హారిక అండ్ హాసిని బ్యానర్ వారు నవీన్ ని పోలిశెట్టిని ఏకంగా 5 కోట్ల పారితోషకాని లాక్ చేసేశారనే టాక్ వినిపిస్తుంది. నవీన్ పోలిశెట్టి కి ఇప్పుడు 2.50 కోట్ల అడ్వాన్ ఇచ్చి.. మరి మిగిలింది, సినిమా రిలీజ్ అయ్యాక ఇచ్చేలా ఒప్పందాలు కూడా చేసేసుకున్నారట. ఇంతకీ దర్శకుడు ఎవరో తేలకుండానే హారిక & హాసిని వారు నవీన్ ని లాక్ చేసేసారట.
హారిక & హాసిని బ్యానర్ కన్నా ముందే యువీ నిర్మాతలతో నవీన్ పోలిశెట్టికి ఒప్పందం అయ్యింది. అనుష్క హీరోయిన్ గా మొదలు కాబోతున్న ఈ మూవీకి నవీన్ 4 కోట్ల పారితోషకం అందుకోబోతున్నాడనే టాక్ ఉంది.