Advertisementt

ఎఫ్ 3 కి రాజు గారి సలహాలు

Sun 21st Mar 2021 07:12 PM
dil raju,f3 movie,director anil ravipudi,venkatesh f3,varun tej f3,venkatesh - varun tej combo,venky,varun,dil raju - anil ravipudi f3,f3 movie release date,f3 movie review  ఎఫ్ 3 కి రాజు గారి సలహాలు
Dil Raju advice to F3 ఎఫ్ 3 కి రాజు గారి సలహాలు
Advertisement
Ads by CJ

అనిల్ రావిపూడి దర్శకుడిగా వెంకటేష్ - వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఎఫ్ 3 కి నిర్మాత దిల్ రాజే. ఇంకా ఆయన సహాయం ఏమిటి అనుకుంటున్నారా.. అంటే తన ఆస్థాన దర్శకుడు అనిల్ రావిపూడి కి ఎఫ్ 3 స్క్రిప్ట్ లో దిల్ రాజు గారి సలహాలు సూచనలు ఎక్కువయ్యాయట. ఎఫ్ 2 మాత్రమే కాదు.. అంతకుముందు అనిల్ రావిపూడి చేసిన సినిమాలన్ని దిల్ రాజు బ్యానర్ లో చేసినవే. అందుకే అనిల్ రావిపూడి కి స్క్రిప్ట్ విషయంలో, సినిమా విషయంలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టే ఇచ్చి.. ఇప్పుడు సలహాలు ఇస్తున్నాడట. ఎఫ్ 3 షూటింగ్ ని అనిల్ రావిపూడి శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. వరుణ్ - వెంటకటేష్ లు కూడా గ్యాప్ తీసుకోకుండా ఎఫ్ 3  షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

అయితే ఎఫ్ 3 స్క్రిప్ట్ లో దిల్ రాజు మార్పులు చేర్పులు చేస్తున్నాడనే టాక్ వినిపిస్తుంది. వెంకటేష్ రే చీకటి ఎపిసోడ్ ఎఫ్ 3 స్క్రిప్ట్ అనుకున్నప్పుడు లేదట. కానీ దిల్ రాజు ఇలాంటిది ఒకటి పెడితే బావుంటుంది అని అనిల్ కి సలహా ఇవ్వడంతో అనిల్ రావిపూడి కూడా ఫాలో అయ్యిపోయాడట. వెంకీ రే చీకటి సీన్స్ హిలేరియస్ గా తెరకెక్కిస్తున్నాడట. అలాగే మరికొన్ని మార్పులు కూడా దిల్ రాజు సూచించడం అనిల్ అవి ఫాలో అవడం జరిగిందనే టాక్ వినిపిస్తుంది. ఇక ఎఫ్ 2 లో అంతేగా.. అంతేగా అనే మ్యానరిజం బాగా పాపులర్ అవడంతో.. ఇప్పుడు ఎఫ్ 3 లో ఇంకాస్త డిఫ్రెంట్ మేనిరిజాన్ని ట్రై చేస్తున్నారట. మనీ చుట్టూ హిలేరియస్ కామెడీ ని ఎఫ్ 3 లో  అనిల్ రావిపూడి చూపించబోతున్నాడు అనేది తెలిసిన విషయమే.

Dil Raju advice to F3:

F3 Movie update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ