Advertisementt

నిండా మునిగిన మంచు విష్ణు

Sun 21st Mar 2021 11:45 AM
manchu vishnu,mosagallu movie,kajal,sunil shetty,vishnu mosagallu,huge disaster  నిండా మునిగిన మంచు విష్ణు
Mosagallu Movie towards a huge disaster నిండా మునిగిన మంచు విష్ణు
Advertisement
Ads by CJ

కొన్నాళ్లుగా ఫామ్ లో లేని హీరో, తన మర్కెట్ ఎంతుంటుందో స్పష్టంగా తెలిసిన హీరో.. తనకి కథ నచ్చి దాని మీద ఆస్తులని తాకట్టు పెట్టి మరీ సినిమాని నిర్మించి విడుదల చెయ్యడం ఎంత పెద్ద టాస్క్ అనేది మంచు విష్ణు కి పూర్తిగా అర్ధమై ఉంటుంది. ఎందుకంటే వరస సినిమాలతో ప్లాప్ ల్లో ఉన్నాడు. అంతేకాదు.. కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. తర్వాత వెయిట్ తగ్గి మళ్ళీ మోసగాళ్లు స్రిప్ట్ చూసి హాలీవుడ్ స్టాండర్స్ లో ఉంది.. ఏ నిర్మాత చెయ్యకపోయినా మనమే చేద్దామని డిసైడ్ అయ్యి 50 కోట్లు పెట్టుబడి పెట్టి, కాజల్ లాంటి హీరోయిన్ ని, సునీల్ శెట్టి లాంటి నటుడిని తీసుకుని మోసగాళ్లు సినిమాని చేసేసాడు. చ‌రిత్ర‌లో క‌నీ వినీ ఎరుగని భారీ స్కామ్ అని ఊరించి సినిమాని విడుదల చేసిన మోసగాళ్లు సినిమాకి కనీస ఓపెనింగ్స్ రాలేదు.

క్రేజ్ లేకుండా విడుదలైన మోసగాళ్లకు క్రిటిక్స్ కూడా నెగెటివ్ రివ్యూస్ ఇవ్వడం, సినిమాలో విషయం లేకపోవడంతో ప్రేక్షకులను మోసం చేద్దామనుకున్న మోసగాళ్లను.. ప్రేక్షకులే మోసం చేసేసారు. ఫ్రైడే ఫస్ట్ షో కే మోసగాళ్ల విషయం తెలుసుకుని ప్రేక్షకులు సైలెంట్ అయ్యారు. ఇక ఈ సినిమా విడుదలకు ముందు ఎవరూ కొనకపోతే మంచు విష్ణు నే డైరెక్ట్ గా కొన్ని చోట్ల విడుదల చేసాడట. ఇప్పుడు చూస్తే థియేటర్స్ అడ్వాన్స్ లు కూడా వచ్చేలా కనిపించడం లేదు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక శాటిలైట్, డిజిటల్ రైట్స్ కొందామనుకుని మోసగాళ్ళని బేరం చెయ్యలేదు ఎవరూ. ఇప్పుడు చూస్తే మొదటికే మోసం వచ్చింది. పాన్ ఇండియా లెవల్లో సినిమాని విడుదల చేసి మంచు విష్ణు నిండా మునిగిపోయాడు. అటు డబ్బు పోయే.. ఇటు ఇంకేదో పట్టడడం అంటే ఇదే అనేలా ఉంది మంచు విష్ణు పరిస్థితి.

Mosagallu Movie towards a huge disaster:

Manchu vishnu Mosagallu Movie towards a huge disaster

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ