Advertisementt

కీర్తి సురేష్ మిస్సింగ్

Sat 20th Mar 2021 08:14 PM
keerthy suresh,nithin,rang de movie,rang de promotions,keerty suresh as anu,nithin rang de movie  కీర్తి సురేష్ మిస్సింగ్
Keerthy Suresh Missing కీర్తి సురేష్ మిస్సింగ్
Advertisement
Ads by CJ

నిజమేనండి కీర్తి సురేష్ మిస్సింగ్, కనబడుటలేదు. అదీ కీర్తి సురేష్ రంగ్ దే ప్రమోషన్స్ లో కనిపించడం లేదని దానర్ధం. నితిన్ తో కలిసి రంగ్ దే లో నటించిన కీర్తి సురేష్ రంగ్ దే ప్రమోషన్స్ లో అంటే నిన్న జరిగిన రంగ్ దే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కనిపించలేదు. అలాగే ఛానల్ ఇంటర్వూస్ లో కీర్తి కనిపించడం లేదు. అందుకే నితిన్ రంగ్ దే ప్రమోషన్స్ లో కీర్తి సురేష్ మిస్సింగ్, కనబడుటలేదు అంటూ.. 

డియర్ అను,

నువ్వు ఎక్కడున్నా రంగ్ దే ప్రొమోషన్స్ లో జాయిన్ అవ్వాలని మా కోరిక ..

             ఇట్లు నీ అర్జున్ 

ఇలా సోషల్ మీడియాలో కీర్తి సురేష్ ఫోటో పెట్టి మరీ పోస్ట్ చేసాడు. కీర్తి సురేష్ రంగ్ దే ప్రమోషన్స్ కి రావాలంటూ.. నితిన్ ఫన్నీ గా చేసిన పోస్ట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రంగ్ దే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న కీర్తి సురేష్.. మహేష్ బాబు తో సర్కారు వారి పాట షూటింగ్ లో బిజీగా ఉండడం వలన రంగ్ దే ప్రమోషన్స్ కి రాలేకపోతుంది. అదే విషయాన్ని ఫన్నీ గా నితిన్ రంగ్ దే ప్రమోషన్స్ కి వాడేసాడు. మరి నితిన్ అలా కీర్తి ఫోటో పెట్టి రంగ్ దే లో కేరెక్టర్స్ నేమ్స్ తో ఇలా పోస్ట్ చెయ్యడంతో.. దానికి రిప్లై గా హైదరాబాద్ సిటీ పోలీస్ లు డోంట్ వర్రీ నితిన్ గారు మేము చూసుకుంటాం అంటూ ట్వీట్ చెయ్యడం సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. అన్నట్టు రేపు జరగబోయే రంగ్ దే ప్రీ రీలీజ్ ఈవెంట్ కి కీర్తి సురేష్ వస్తుంది.

Keerthy Suresh Missing:

Keerthy Suresh Missing in Rang De promotions

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ