Advertisementt

రాధే శ్యామ్ విజువల్ ఎఫెక్ట్స్ కి అన్ని కోట్లా?

Fri 19th Mar 2021 10:54 PM
prabhas,radhe shyam movie,radhe shyam visual effects,prabhas - pooja hegde,prabhas radhesyam movie,radhe shyam pan india movie  రాధే శ్యామ్ విజువల్ ఎఫెక్ట్స్ కి అన్ని కోట్లా?
Shocking amount to Radhe Shyam visual effects రాధే శ్యామ్ విజువల్ ఎఫెక్ట్స్ కి అన్ని కోట్లా?
Advertisement
Ads by CJ

గతంలో సాహో సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ కి అన్ని కోట్లు ఖర్చు పెట్టారు.. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారనే న్యూస్ లు మనం విన్నాము. ఒక్క క్లయిమాక్స్ కోసమే దాదాపుగా 40 కోట్లు పెట్టారు సాహో సినిమాకి. అదీ చూసాము. కాకపోతే సాహో సినిమా రిజల్ట్ అనుకున్న రేంజ్ లో రాకపోయినా.. హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ సీక్వెన్సెస్ ని ఎలా కంపోజ్ చేసారో మనం చూసాం. అయితే విశేషం ఏమిటి అంటే ప్రభాస్ లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ అనేది యాక్షన్ ఫిలిం కాకపోయినా.. అంతటి హెవీ సీక్వెన్సెస్ ఏమి లేకపోయినా.. ఈ సినిమాకి కూడా విజువల్ ఎఫెక్ట్స్ కి గట్టిగానే ఖర్చు పెడుతున్నారు మేకర్స్. 

ఎందుకంటే తీసుకున్న ఆ బ్యాగ్డ్రాప్ కి.. ఆ రెట్రో స్టయిల్ కి బాగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. రాధేశ్యామ్ కి కూడా దాదాపుగా 60 కోట్లు విజువల్ ఎఫెక్ట్స్ కి ఖర్చు పెడుతున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా రాధేశ్యామ్ క్లయిమాక్స్ పార్ట్ మాత్రం మళ్ళీ విజువల్ వండర్ గా ఉంటుందట. అయితే ఆ క్లయిమాక్స్ యాక్షన్ వేలో కాదండోయ్ పాలిటిక్ వేలో ఉండబోతుందట. రాధేశ్యామ్ జులై 30 న పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది. ప్రభాస్ - పూజ హెగ్డే నటిస్తున్న ఈ సినిమాకి రాధాకృష్ణ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ లో భారీ లెవల్లో నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ హోప్స్ ఉన్నాయి.

Shocking amount to Radhe Shyam visual effects:

Huge amount to radhe shyam visual effects

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ