విజయ్ దేవరకొండ అంటే క్రేజ్ అలా ఉంచి.. ఓ బ్రాండ్ గా మారిపోయాడు. విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ అంటే యూత్ లో మంచి క్రేజ్ ఉంది. స్టార్ హీరోగా ఎదుగుతున్నప్పుడే రౌడీ బ్రాండ్స్ పేరుతొ దుస్తుల వ్యాపారాన్ని మొదలు పెట్టాడు. రౌడీ బ్రాండ్స్ చాలా త్వరగా క్లిక్ అవడమే కాదు.. తెగ పాపులర్ అయ్యాయి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు.. హిందీ ప్రేక్షకులను తాకింది. అక్కడి టాప్ హీరోయిన్స్ అయితే విజయ్ దేవరకొండ అంటే క్రష్ అని చెబుతుంటారు. ఇక విజయ్ ప్రస్తుతం పాన్ ఇండియా ఫిలిం లైగర్ షూట్ లో ముంబైలో బిజీగా వున్నాడు. అయితే విజయ్ దేవరకొండ వస్త్ర వ్యాపారమే కాకుండా ఇప్పుడు థియేటర్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టాడు. హైదరాబాద్ లో ఏషియన్ సినిమాస్ డిస్ట్రిబ్యూటర్స్ మహేష్ బాబు తో కలిసి AMB మల్టిప్లెక్స్ బిజినెస్ మొదలు పెట్టి సక్సెస్ అయ్యారు.
ఆ తర్వాత ఏషియన్ వారు అల్లు అర్జున్ తో అమీర్ పేట లో సత్యం థియేటర్ స్థలంలో ఓ మల్టిప్లెక్స్ కి శ్రీకారం చుట్టింది. ఇక విజయ్ దేవరకొండ స్వస్థలం మహబూబ్ నగర్ లో ఏషియన్ సినిమాతో కలిసి విజయ్ దేవరకొండ మూడు థియేటర్స్ ఉన్న మల్టిప్లెక్స్ నిర్మాణాన్ని పూర్తి చేసేసాడు. ఏషియన్ సినిమా - విజయ్ దేవరకొండ కాంబోలో రూపుదిద్దుకున్న కొత్త మల్టీప్లెక్స్ కి AVD (ఏషియన్ విజయ్ దేవరకొండ) సినిమాస్ అని పేరు పెట్టారు. మరి AVD (ఏషియన్ విజయ్ దేవరకొండ) సినిమాస్ ని ఓపెన్ చేయబోయేది ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అంటే పవన్ వెళ్లి రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చెయ్యడం కాదు.. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ AVD (ఏషియన్ విజయ్ దేవరకొండ) సినిమాస్ లో మొదటగా రిలీజ్ అవ్వబోతున్న మూవీ అన్నమాట.