Advertisementt

ఇటలీలో ఛిల్ అవుతున్న మాస్ మహారాజ్

Fri 19th Mar 2021 06:46 PM
ravi teja,ramesh varma,satyanarayana koneru,khiladi movie,khiladi shooting,italy  ఇటలీలో ఛిల్ అవుతున్న మాస్ మహారాజ్
Mass Maharaj chilling in Italy ఇటలీలో ఛిల్ అవుతున్న మాస్ మహారాజ్
Advertisement
Ads by CJ

ఇట‌లీలో షూటింగ్ జ‌రుపుకుంటున్న ర‌వితేజ‌, ర‌మేష్ వ‌ర్మ‌, స‌త్య‌నారాయ‌ణ కోనేరు ఖిలాడి ‌‌

క్రాక్ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా, రాక్ష‌సుడు వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ని తెర‌కెక్కించిన ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ఖిలాడి. ర‌వితేజ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న ఈ చిత్రానికి స‌త్య‌నారాయ‌ణ కోనేరు నిర్మాత‌.  డా. జ‌యంతీలాల్ గ‌డ  స‌మ‌‌ర్ప‌ణ‌లో ఏ స్టూడియోస్‌తో క‌లిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి  ప్లే స్మార్ట్ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ  సినిమా యాక్ష‌న్ ల‌వ‌ర్స్‌కు మంచి ట్రీట్ అవుతుంద‌ని నిర్మాత‌లు తెలిపారు.

మే 28న ఖిలాడిని ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ఇట‌లీలోని అంద‌మైన లొకేష‌న్ల‌లో జ‌రుగుతోంది. అక్క‌డ ర‌వితేజ స‌హా ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు.

ఇంత‌కుముందు ర‌వితేజ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 26న విడుద‌ల చేసిన వీడియో గ్లిమ్స్‌కు, రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ ల‌భించింది. ర‌వితేజ లుక్ అభిమానుల‌ను, ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంది.

ర‌వితేజ స‌ర‌స‌న మీనాక్షి చౌధ‌రి మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, డింపుల్ హ‌య‌తి సెకండ్ హీరోయిన్ రోల్ చేస్తున్నారు.

ఉన్న‌త స్థాయి టెక్నిక‌ల్ విలువ‌ల‌తో ర‌మేష్ వ‌ర్మ ఖిలాడిని ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా తీర్చిదిద్దుతున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీప్రసాద్ అందిస్తున్న మ్యూజిక్ ఈ సినిమాకు బిగ్ ఎస్సెట్ కానున్న‌ది. సౌత్ ఇండ‌స్ట్రీలోని న‌లుగురు టాప్ ఫైట్ మాస్ట‌ర్లు రామ్‌-ల‌క్ష్మ‌ణ్, అన్బు-అరివు మాస్ట‌ర్స్ ఈ చిత్రానికి వ‌ర్క్ చేస్తుండ‌డం విశేషం. లూసిఫ‌ర్ ఫేమ్ సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

శ్రీ‌కాంత్ విస్సా, దేవిశ్రీ ప్ర‌సాద్ సోద‌రుడు సాగ‌ర్‌ డైలాగ్స్ రాస్తున్న ఈ చిత్రానికి శ్రీ‌మ‌ణి సాహిత్యం అందిస్తున్నారు. అమ‌ర్ రెడ్డి ఎడిట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

Mass Maharaj chilling in Italy:

Ravi Teja, Ramesh Varma, Satyanarayana Koneru Khiladi shooting in Italy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ