Advertisementt

పూజ సూపర్ హిట్ పాత్రని కొట్టేసిన కృతి

Fri 19th Mar 2021 12:25 PM
kriti sanon,kartik aaryan,ala vaikunthapurramuloo remake,adipurush heroine,krithi sanon,kriti  పూజ సూపర్ హిట్ పాత్రని కొట్టేసిన కృతి
Kriti Sanon to play lead role in Telugu remake పూజ సూపర్ హిట్ పాత్రని కొట్టేసిన కృతి
Advertisement
Ads by CJ

గత ఏడాది పూజ హెగ్డే కి అలా వైకుంఠపురములో సినిమా కెరీర్ లో మరిచిపోలేని బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. పూజ ఎంతగా స్టార్ హీరోల సినిమాల్లో నటించినా ఆమెకి అలా వైకుంఠపురములో అన్నంత హిట్ అయితే రాలేదు. ఆ సినిమా పూజ హెగ్డే ని మేడం గా అందనంత ఎత్తులో కూర్చోబెట్టింది. అయితే ఇప్పుడు అలా వైకుంఠపురములో మూవీని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. భారీ ధరకు రీమేక్ రైట్స్ కొనుక్కుని ఆ సినిమాని హిందీలోకి దింపుతున్నారు. వరుణ్ ధావన్ సోదరుడు రోహిత్ ధావన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ హీరో.

అయితే తెలుగులో పూజ హెగ్డే చేసిన ఆ పాత్రకి బాలీవుడ్ లో కృతి సనన్ ని ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ప్రభాస్ ఆదిపురుష్ లో హీరోయిన్ గా ఎంపికై ఒక్కసారిగా లైం లైట్ లోకొచ్చిన కృతి సనన్ ఇప్పడు అలా వైకుంఠపురములో హిందీ రీమేక్ లో కూడా హీరోయిన్ గా ఎంపికైనట్లుగా బిటౌన్ న్యూస్. మరి తెలుగులో పూజకి మంచి గుర్తింపు తెచ్చిన ఈ సినిమా కృతి సనన్ కి కూడా మంచి హిట్ ఇస్తుందేమో చూడాలి..

Kriti Sanon to play lead role in Telugu remake:

Kriti Sanon to join Kartik Aaryan in Ala Vaikunthapurramuloo remake

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ