బాలకృష్ణ తన BB3 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇటు సాయి పల్లవి తాను నటించిన లవ్ స్టోరీ, విరాట పర్వం మూవీ షూటింగ్స్ కంప్లీట్ చేసి ఆయా సినిమాల ప్రమోషన్స్ కి రెడీ అవుతుంది. ప్రస్తుతం సాయి పల్లవి నటిస్తున్న లవ్ స్టోరీ, విరాట పర్వం మూవీస్ పై విపరీతమైన బజ్ ఉంది. సాయి పల్లవి ప్రధాన ఆకర్షణగా కనిపిస్తున్న ఈ రెండు సినిమాల కోసం ప్రేక్షకులు వెయిటింగ్. ఇకపోతే బాలయ్య - సాయి పల్లవి కాంబో న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది కూడా బాలకృష్ణ తండ్రి పాత్రలో సాయి పల్లవి బాలయ్య కూతురు పాత్రలో అనే న్యూస్ ఉంది చూశారూ.. విపరీతంగా సర్క్యులేట్ అయ్యింది.
BB3 షూటింగ్ లో బిజీగా ఉన్న బాలయ్య ని ఓ యంగ్ డైరెక్టర్ కలిసి మూడే మూడు నిమిషాల్లో ఓ స్టోరీ లైన్ చెప్పాడని, ఆ లైన్ నచ్చిన బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. అయితే ఆ కథ తండ్రి కూతుళ్ళకి సంబందించిన కథ కావడం చేత.. ఆ కూతురు పాత్రకి సాయి పల్లవి అయితే బావుంటుంది అని సదరు డైరెక్టర్.. సాయి పల్లవిని సంప్రదించే ఆలోచనలో ఉన్నాడట. కథా బలం, పాత్రలో ప్రాముఖ్యత ఉంటే.. సాయి పల్లవి కాదనదు అనే నమ్మకం ఆ డైరెక్టర్ కి ఉందట. ఇక కథ కూడా తండ్రిని కాపాడటం కోసం కుమార్తె పోరాడే కథగా ఉండబోతుంది మరి సాయి పల్లవి ఈ సినిమాకి ఓకె చెప్పి బాలయ్యని నాన్నా అని పిలుస్తుందా? అసలు బాలయ్య ఒప్పుకున్నాడా? అనేది ఇప్పుడు అందరి ముందు ఉన్న డౌట్.