ఈ శుక్రవారం ఎప్పటిలాగే మూడు సినిమాలు పోటీ పడుతున్నాయి. జాతి రత్నాల క్రేజ్ ఇంకా నడుస్తున్న టైం లోనే కార్తికేయ చావు కబురు చల్లగా, మంచు విష్ణు మోసగాళ్లు, ఆది సాయి కుమార్ శశి మూవీస్ థియేటర్స్ లోకొచ్చేసారు. ముగురు ప్లాప్ హీరోలవడం, మూడు సినిమాలకు ఎంతగా ప్రమోషన్స్ చేసినా సినిమాపై ప్రేక్షకుల్లో బజ్ లేకపోవడంతో.. ఈ రోజు రిలీజ్ అయిన ఆ మూడు సినిమాలకు ప్రేక్షకుల సందడి కరువయ్యింది. మూడు సినిమాల్లో కార్తికేయ చావు కబూరు చల్లగా మూవీ కి మార్కెట్ లో మంచి బుజ్ ఉంది. గీత ఆర్ట్స్ బ్యానర్ నుండి వస్తున్న సినిమా కావచ్చు, కార్తికేయ - లావణ్య త్రిపాఠి చేసిన ప్రమోషన్స్ కావొచ్చు.. ఈ సినిమాపై అంతో ఇంతో క్రేజ్ ఉంది. ఇక మంచు విష్ణు మోసగాళ్లు సినిమాలో కాజల్ నటించినా జనాల్లో క్రేజ్ రాలేదు. అది సాయి కుమార్ శశి పరిస్థితి అదే.
సోషల్ మీడియాలో ఎంతగా పబ్లిసిటీ చేసినా.. ఈ రోజు విడుదలయిన ఈ మూడు మూవీస్ కి థియేటర్స్ దగ్గర సందడి కొరవడింది. బుక్ మై షో లో అయితే ఒక్క షో కూడా ఫుల్ అయిన దాఖలాలు లేవు. కనీసం సాయంత్రం షోస్ కూడా ఇంతవరకు ఫుల్ అవలేదంటే థియేటర్స్ లో ఈ మూడు సినిమాల పరిసితి ఎలా ఉందొ తెలుస్తుంది. మరి ముగ్గురు హీరోలకు ఈ సినిమాలు హిట్ అవడం ఎంతో ఇంపార్టెంట్. లేదు ఈ సినిమాల రిజల్ట్స్ బాక్సాఫీసు వద్ద తేడా కొట్టాయంటే వారు డేంజర్ జోన్ లోకి వెళ్ళినట్టే.