2019 అక్టోబర్ 2 న చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ సై రా నరసింహ రెడ్డి.. ఎన్నో అంచనాల మధ్యన రిలీజ్ అయితే.. దీన్ని గట్టి దెబ్బె కొట్టింది బాలీవుడ్ నుండి వచ్చిన వార్ సినిమా. సై రా రిలీజ్ అయిన రోజే అంటే అక్టోబర్ 2 నే విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల వరకు చిరు సై రా మీద పెద్దగా ఎఫెక్ట్ పడకపోయినా.. అటు హిందీ రిలీజ్ కి.. తాను ప్లాన్ చేసుకున్న పాన్ ఇండియా రిలీజ్ కి, ఓవర్సీస్ మార్కెట్ కి వార్ సినిమాతో హృతిక్ రోషన్ గట్టి దెబ్బకొట్టాడు. వార్ సినిమాతో సై రా రెవిన్యూ మీద బాగా ఇంపాక్ట్ పడింది అనేది అందరికి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ కాబోతుందనిపిస్తుంది.
ఎన్నో అంచనాల మధ్యన ఇక్కడ చిరంజీవి ఆచార్య సినిమా మే 13 న రిలీజ్ కి గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటుంటే.. అక్కడ ఓవర్సీస్ మార్కెట్ ఓపెన్ అయ్యింది. కాస్త రెవిన్యూ రాబట్టుకోవచ్చు అనే హోప్స్ వస్తుంటే.. బాలీవుడ్ బాక్సాఫీసుకా భాయ్ అదే రోజు అంటే మే 13 న ఆచార్య రిలీజ్ రోజునే రాధే తో దిగుతున్నాడు. ప్రతి ఈద్ కి ఓ సినిమా తో రావడం, బాక్సాఫీసుని కొల్లగొట్టడం, కలెక్షన్స్ తో సంబరాలు జరుపుకోవడం సల్మాన్ కి అలవాటే. ఈసారి కూడా అదే ప్లాన్ లో ఆ ప్రోజెక్టు ని సిద్ధం చేస్తున్నాడు. ఇది మళ్ళీ చిరరంజీవి కి మరో మెగా డ్యామేజ్ జరిగేలానే ఉంది.
దీనికి తోడు జాన్ అబ్రహం ఎంతో ప్రస్టేజియస్ గా చేస్తున్న సత్యమేవ జయతే 2 కూడా అదే మే13 న రిలీజ్ కాబోతుంది. బాక్సాఫీసు నుండి రెండు వైపులా ఇద్దరు యాక్షన్ హీరోలని తట్టుకోవాలి ఇక్కడున్న తండ్రీకొడుకులు చిరు అండ్ రామ్ చరణ్ లు. మరి ఏం చేస్తారో జస్ట్ వెయిట్ అండ్ వాచ్.