ఈమధ్యన మలయాళం నుండి బోలెడన్ని సినిమాలు తెలుగులోకి దిగుమతి అవుతున్నాయి. అక్కడ సూపర్ హిట్ అయిన ఫిలిమ్స్ ని ఇక్కడ మన స్టార్స్ రీమేక్ చేస్తున్నారు. తెలుగు నేటివికి కాస్త అటు ఇటుగా స్క్రిప్ట్ చేంజెస్ చేసి తెలుగు ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ మలయాళంలో హిట్ అయిన అయ్యప్పన్ కోషియమ్ ని రానా కాంబోలో చేస్తుంటే.. మెగాస్టార్ చిరు మోహన్ లాల్ లూసిఫర్ రీమేక్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు రవితేజ మరో మలయాళ సూపర్ హిట్ ఫిలిం ని తెలుగులోకి దింపుతున్నాడు. అది మలయాళంలో సూపర్ బ్లాక్ బస్టర్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ ని తెలుగులో రవితేజ రీమేక్ చెయ్యబోతున్నాడు.
పృద్వి రాజ్ - సూరజ్ వెంజరమూడు కాంబోలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ ని రవితేజ.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తో కలిసి రీమేక్ చెయ్యబోతున్నాడు.. ఈ సినిమాని రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్స్ లో నిర్మించబోతున్నాడు. ఈ సినిమాలో పవర్ ఫుల్ కేరెక్టర్ చేసిన పృద్వి రాజ్ కేరెక్టర్ ని రవితేజ ప్లే చేస్తుండగా.. సూరజ్ వెంజరమూడు కేరెక్టర్ లో కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి కనిపించబోతున్నాడు. రవితేజ - మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబోలో రామ్ చరణ్ నిర్మాతగా డ్రైవింగ్ లైసెన్స్ మూవీ తెలుగులో అధికారికంగా రీమేక్ కాబోతుంది.