అక్కినేని నాగార్జున రీసెంట్ చిత్రం వైల్డ్ డాగ్ ని మొదట ఓటిటిలో రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ జనవరిలో రవితేజ క్రాక్, ఫిబ్రవరిలో వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాల రిజల్ట్ లు, బాక్సాఫీసు కలెక్షన్స్ చూసి ఎక్కడ లేని ఉత్సాహం తెచ్చుకుని వైల్డ్ డాగ్ యూనిట్.. థియేటర్స్ లోకి దిగిపోదామనే ఆలోచనకి వచ్చేసింది. వైల్డ్ డాగ్.. థియేటర్స్ లో రిలీజ్ అవడం వెనుక టాలీవుడ్ నిర్మాత ఒకరు ఉన్నారనేది అందరూ అనుకుంటున్న మాట. ఏప్రిల్ 2 నే వైల్డ్ డాగ్ థియేటర్స్ లో రిలీజ్ చెయ్యాలనే దానిలో నిర్మాత దిల్ రాజు ప్రోద్బలం కూడా ఉంది అనేది ఇండస్ట్రీ టాక్. ఏదేమైనా మొత్తానికైతే వైల్డ్ డాగ్ హడావిడి మొదలు పెట్టారు. వైల్డ్ డాగ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు.
నాగార్జున కెరీర్ లోనే ఎప్పుడూ లేనంతగా యూట్యూబ్ ని షేక్ చేసేంతగా వైల్డ్ డాగ్ ట్రైలర్ కి వ్యూస్ వచ్చేసాయి.. అనే హంగామా రేజ్ చేసారు. ఇక్కడివరకు ఓకె. నిజంగా సినిమా పై ఇంత బజ్ క్రియేట్ అయితే అందరికి హ్యాపీనే. కానీ ఇక్కడే మొదలైంది నాగార్జున అత్యుత్సాహం. రేపు రిలీజ్ కాబోయే సినిమాల ప్రమోషన్స్ లో హీరోలు ఉన్నారు. మార్చి 26 న వచ్చే సినిమాల ప్రమోషన్స్ ఇంకా ఊపందుకోలేదు. ఎప్పుడో ఏప్రిల్ 2 న రావాల్సిన సినిమా కోసం ఇప్పటినుండే ఛానల్స్ ఇంటర్వూస్, ప్రెస్ మీట్స్ పెట్టి కొంచెం ఎక్కువ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు నాగ్. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఓ వన్ వీక్ గ్యాప్ తీసుకుని ప్రవీణ్ సత్తారుతో మొదలైన మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు నాగ్. ఇంత టూ ఎర్లీ గా వైల్డ్ డాగ్ గురించి మాట్లాడడం మాత్రం మిగతా సినిమాల వాళ్ళకి కాస్త చిరాకు తెప్పించేలా ఉంది. ఏ డేట్ సినిమాల ప్రమోషన్స్ వాళ్ళు చేసుకుంటూ ఉంటే.. మధ్యలో నాగ్ ఇలా తొందరపడటం వాళ్లకి నచ్చడం లేదు.