వెంకటేష్ హీరోగా తమిళ అసురన్ ని తెలుగులో శ్రీకాంత్ అడ్డాల డైరెక్టర్ గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ధనుష్ నటించిన అసురన్ సినిమాని వెంకీ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అయితే నారప్ప టీజర్ రిలీజ్ అయ్యింది మొదలు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్న మణిశర్మకి నారప్ప టీమ్ కి కి పొసగడం లేదు. మణిశర్మ కొన్నాళ్లుగా ఫామ్ లో లేకపోయినా.. ఇస్మార్ట్ శంకర్ హిట్ తో మళ్ళీ చిరు ఆచార్య, వెంకీ నారప్ప లాంటి బిగ్ ప్రాజెక్ట్స్ కి సైన్ చేసాడు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ స్పెషలిస్ట్ అయిన మణిశర్మ ని నారప్ప టీం అవమానించింది అని ఆయన ఫీలవుతున్నారు.
నారప్ప సినిమా మ్యూజిక్ విషయంలో నారప్ప టీం మణిశర్మ పేరు వేస్తూ.. తమిళ అసురన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ని యాజిటీజ్ గా వాడెయ్యడంతో.. అందరూ మణిశర్మ అసురన్ ట్యూన్స్ ని కాపీ కొట్టి నారప్పకి ఇచ్చాడని మణిశర్మ ని కామెంట్ చెయ్యడంతో.. బాగా హార్ట్ అయిన మణిశర్మ ఓ ఇంటర్వ్యూ లో నారప్ప కి తాను మ్యూజిక్ ఇచ్చినప్పటికీ అసురన్ ఒరిజినల్ ట్యూన్స్ నే వాడేసారని తాను ఇచ్చిన మ్యూజిక్ ని పక్కనబెట్టేశారని వివరణ ఇచ్చారు. అయినా ఆ విషయంలో మణిశర్మ బాగా హార్ట్ అయ్యారు. అప్పటినుండి నారప్ప విషయంలో మణిశర్మ అంటీముట్టనట్టుగా ఉండడమే కాదు.. రీసెంట్ గా నా పేరు నారప్ప టైటిల్ లో వెయ్యొద్దు నేను ఈ ప్రాజెక్ట్ నుండి అధికారికంగా తప్పుకుంటున్నాను అని చెప్పినట్టుగా సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.
మే 14 న విడుదలకు రెడీ అవుతున్న నారప్ప సినిమా టైటిల్ లో మోస్ట్లీ మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మ పేరు ఉండకపోవచ్చనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.