రేపు శుక్రవారం మూడు సినిమాలు బాక్సాఫీసు ఫైట్ ని షురూ చేసాయి. ప్లాప్స్ లో కొట్టు మిట్టాడుతున్న అది సాయి కుమార్, మంచు విష్ణు, కార్తికేయ ముగ్గురూ ఒకేరోజు తమ తమ సినిమాలతో బాక్సాఫీసు ఫైట్ కి సిద్ధమయ్యారు. మోసగాళ్లు, చావు కబురు చల్లగా, శశి అంటూ మూడు సినిమాలతో యుద్దానికి సిద్ధమయ్యారు. ఎవరి ప్రమోషన్స్ వాళ్ళు చేస్తున్నారు. కార్తికేయ గీత ఆర్ట్స్ బ్యానర్ తో కలిసి చావు కబురు చల్లగా సినిమాపై హైప్ క్రియేట్ చేసే ప్రయత్నాల్లో ప్రీ రిలీజ్ టూర్ మొదలు పెట్టాడు. లావణ్య త్రిపాఠితో కలిసి కార్తికేయ కష్టపడుతున్నాడు. మరోపక్క మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ స్పెషల్ ఇంటర్వూస్ అంటున్నారు. అది సాయి కుమార్ తన వంతుగా సినిమాకి క్రేజ్ తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు.
కానీ రేపు విడుదల కాబోయే సినిమాలకు కనీసం టికెట్స్ తెగడం లేదు. మినిమం బజ్ కనిపించని సినిమాలు చూసి టైం వెస్ట్ చేసుకోవడం తప్ప సినిమా చూడడం అవసరమా అన్నట్టుగా ఉన్నాయి బుక్ మై షో లో టికెట్స్ పరిస్థితి. చాలా వీక్ బుకింగ్స్ తో మూడూ మూడే అన్నట్టుగా ఉంది వ్యవహారం. బుక్ మై షో లో చావు కబురు కానీ, మోసగాళ్లు కానీ, శశి కానీ మూడు సినిమాలు ఇంతవరకు టికెట్స్ బుకింగ్ స్టార్ట్ కాలేదు. బుక్ మై షో లో మూడు సినిమాలను పెట్టినా టికెట్స్ తెగడం లేదు. మూడు సినిమాలపై ప్రేక్షకుల ఆసక్తి ఇక్కడ బుక్ మై షో విషయంలోనే తేలిపోయేలా ఉంది. ఇక సినిమాలు రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ పడితే తప్ప ఆయా సినిమా థియేటర్స్ కి ప్రేక్షకులు వచ్చేలా లేరు.