పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక సినిమాల విషయం లైట్ తీసుకున్నట్టే కనబడినా.. రెండేళ్ల తర్వాత రాజకీయాల్లో అనుకున్న సక్సెస్ రాకపోవడంతో.. అటు పార్టీని నడిపించాలన్నా.. మరోపక్క తన ఖర్చులకి డబ్బు కావాలన్నా డబ్బు సినిమాలు చెయ్యాల్సిన అగత్యం ఏర్పడింది అంటూ పవన్ ఎన్నోసార్లు చెప్పారు. అయితే సినిమాలను కూడా పవన్ రాజకీయాలకు ఉపయోగించుకుంటారేమో.. పొలిటికల్ స్టోరీస్ తో సినిమాలు చేస్తారనుకుంటే.. ముందుగా బాలీవుడ్ పింక్ రీమేక్ వకీల్ సాబ్ చేసిన పవన్ తర్వాత క్రిష్ తో జానపద చిత్రం హరిహర వీరమల్లు చేస్తున్నారు. క్రిష్ మూవీ పాన్ ఇండియా లెవల్లో నెక్స్ట్ సంక్రాంతికి విడుదల కాబోతుంది.
అయితే వకీల్ సాబ్ లో సత్యమేవ జయతే సాంగ్ లిరిక్స్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సాంగ్ లా జనసైనుకులని ఉత్సాహపరిచేవిగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక క్రిష్ సినిమాలో రాజకీయాలకు ఎలాంటి ఛాన్స్ లేదు. కానీ హరీష్ తో పవన్ చెయ్యబోయే PSPK 28 లో పవన్ రాజకీయాలకు సపోర్ట్ గా సమకాలీన రాజకీయాల అంశాలతో పాటు దేశభక్తి నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతుంది. సినిమా ఫస్ట్ హాఫ్ లో లెక్చరర్ గా కనిపించనున్న పవన్ తర్వాత ఎలా పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యాడు అనే విషయాన్నీ హరీష్ శంకర్ ఎంటర్టైనింగ్ గా చూపించబోతున్నాడట. అంటే లెక్చరర్ పవన్ కళ్యాణ్ రాజకీయనాయకుడిగా ఎలా, ఎందుకు మారాల్సి వచ్చింది.. మారాక ఆ పాత్ర ఏం చేసింది అనేది హరీష్ శంకర్ PSPK 28 లో చూపిస్తాడన్నమాట.