Advertisementt

కో వ్యాక్సిన్ తీసుకున్న సీనియర్ హీరో

Wed 17th Mar 2021 12:33 PM
king nagarjuna,akkineni nagarjuna,covid-19 vaccine  కో వ్యాక్సిన్ తీసుకున్న సీనియర్ హీరో
Akkineni Nagarjuna receives first dose of Covid-19 vaccine కో వ్యాక్సిన్ తీసుకున్న సీనియర్ హీరో
Advertisement
Ads by CJ

గత ఏడాది కరోనా మహమ్మారి ప్రజలని ఎంతగా భయబ్రాంతులకి గురి చేసిందో చూసాం. కొంతమంది కరోనా సోకినా తట్టుకున్నారు. మరికొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అందులో గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా కారణంగానే అందరిని వదిలి వెళ్లిపోయారు. అయితే ఈ ఏడాది కరోనా వ్యాక్సినేషన్ వచ్చినా చాలామంది సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అనే భయంతో వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. మరికొందరు రిజిస్టర్ చేయించుకుని వ్యాక్సిన్ తీనుకుంటున్నారు. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలంటూ ప్రజా ప్రతినిధులు ప్రజలని చైతన్యవంతం చేస్తున్నారు. ప్రధాని మోడీ దగ్గరనుండి.. ఉపరాష్ట్రపతి వెంకయ్య వరకు, తమిళ ఇండస్ట్రీలో ఖుష్బూ, కమల్ లాంటి చాలామంది సెలబ్రిటీస్ అంతా కో వ్యాక్సిన్ తీసుకున్నారు.

అయితే టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ ఎవరూ ఇంతవరకు ఈ వ్యాక్సిన్ వేయించుకున్న దాఖలాలు లేవు. కానీ రీసెంట్ గా సీనియర్ హీరో నాగార్జున ఈ కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నట్టుగా ట్వీట్ చేసారు. నాగ్ నిన్న అంటే మంగళవారం కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నానని.. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించడమే కాదు.. ఆన్ లైన్ ద్వారా కరోనా వ్యాక్సిన్ కోసం పేర్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. 

Akkineni Nagarjuna receives first dose of Covid-19 vaccine:

Nagarjuna gets first dose of Covid-19 vaccine

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ