Advertisementt

థియేటర్ సంబడం తీరిపోయిందా?

Tue 16th Mar 2021 09:39 PM
gaali sampath movie,sri vishnu,rajendraprasad,gaali sampath digital streaming,march 19th,aha ott  థియేటర్ సంబడం తీరిపోయిందా?
Gaali Sampath OTT release on March 1th థియేటర్ సంబడం తీరిపోయిందా?
Advertisement
Ads by CJ

నిన్నగాక మొన్న చావు కబురు చల్లగా సినిమా రిలీజ్ అయిన రెండు వారాలకే ఓటిటిలో కొచ్చేస్తుంది అనే గాలి వార్త చూసిన ఆ సినిమా నిర్మాత బన్నీ వాస్ మీడియా సాక్షిగా ఫైర్ అయిన విషయం తెలిసిందే. గిట్టనివాళ్ళ ప్రచారంగా బన్నీ వాస్ ఆ విషయాన్ని కొట్టిపారేశారు. మా సినిమా థియేటర్స్ లో కావాలని రిలీజ్ చేస్తున్నాము.. ఓటిటి ఆఫర్స్ వచ్చినా వదులుకున్నామంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక నేడు గత గురువారం విడుదలైన గాలి సంపత్ వారం తిరక్కుండానే  ఓటిటికి లోకోచ్చేస్తుంది. శ్రీ విష్ణు, రాజేంద్ర ప్రసాద్ కాంబోలో అనిల్ రావిపూడి సమర్పణలో మంచి పబ్లిసిటీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గాలి సంపత్ కి ప్రేక్షకులు సో సో టాక్ ఇచ్చారు.

అయితే లో బడ్జెట్ వలన నిర్మాతలు సేఫ్ అయ్యారు కానీ లేదంటే నిర్మాతలు నిండా మునిగేవారే. ఎందుకంటే గాలి సంపత్ మూవీతో పాటుగా రిలీజ్ అయిన జాతి రత్నాల తాకిడిని గాలి సంపత్ తట్టుకోవడం కష్టంగా మారింది. అందుకే గాలి సంపత్ సైలెంట్ గా రెండో వారంలో ఓటిటిలో రిలీజ్ చేసేస్తున్నారు. మార్చి 19న ఓటీటీలో గాలి సంపత్ విడుదల కాబోతుంది అంటూ ఆహా అధికారికంగా ప్రకటించింది. దానితో అందరూ అప్పుడే థియేటర్స్ సంబడం తీరిపోయిందా అంటున్నారు.

Gaali Sampath OTT release on March 1th:

Gaali Sampath Movie Digital Streaming on March 19th in AHA OTT

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ