మలయాళంలో దృశ్యం సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన దృశ్యం 2 రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. దృశ్యం 2 లో జార్జి కుట్టిగా మోహన్ లాల్ నటన వేరే లెవెల్ అన్నట్టుగా ఉంటే.. జీతూ జోసెఫ్ డైరెక్షన్ స్కిల్స్ అద్భుతం అన్న రేంజ్ లో ఉన్నాయి. అందుకే తెలుగులో రీమేక్ చేస్తున్న వెంకటేష్ మాతృక దర్శకుడు జీతూ జోసెఫ్ ని తెలుగులోకి తెచ్చేసుకున్నాడు. అయితే రీసెంట్ గా దృశ్యం సినిమాలో జార్జి కుట్టిగా నటించిన మోహన్ లాల్ పాత్ర గురించి మట్లాడుతూ.. జార్జి కుట్టి పాత్రలో నటించడం అంత తేలికైన విషయం కాదంటున్నారు.
దృశ్యం 2 లోని కొన్ని సన్నివేశాల్లో ఎమోషనల్ అవుతున్న విషయం కనిపించకుండా నటించాలి. ఇలా చెయ్యడం అంత ఈజీ అయిన విషయం కాదు.. కొంచెం కష్టమైనా పనే. కానీ అక్కడ మనం ఏదో చూస్తున్నట్టుగానే కనిపించాలి. నటన అనేది నిజమైన నమ్మకం. ఒక్కోసారి లోలోపలే ఎమోషనల్ గా నటించాల్సి ఉంటుంది. అలాగే కొన్ని రకాల వేరియేషన్స్ చూపించాల్సి ఉంటుంది. ఇలా చెయ్యడం చాలా కష్టం అంటున్నారు మోహన్ లాల్. మరి దృశ్యం సినిమాతో మోహన్ లాల్ లా వెంకటేష్ కూడా అద్భుతంగానే చేసారు. ఇప్పుడు దృశ్యం 2 రీమేక్ కూడా మోహన్ లాల్ లా వెంకీ రక్తి కట్టించడం ఖాయమే.