Advertisementt

త్రివిక్రమ్ కి తేల్చి చెప్పేసిన తారక్

Tue 16th Mar 2021 01:04 PM
jr ntr,trrivikram,tarak - trivikram,romance new heroine,ntr,rrr movie  త్రివిక్రమ్ కి తేల్చి చెప్పేసిన తారక్
Tarak told Trivikram త్రివిక్రమ్ కి తేల్చి చెప్పేసిన తారక్
Advertisement
Ads by CJ

రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఒక హెవీ మూడ్ నుండి బయటికి వస్తున్న తారక్ తనకి రిలీఫ్ ఇచ్చే కేరెక్టరైజేషన్ ని డిజైన్ చెయ్యమని త్రివిక్రమ్ కి ఆల్రెడీ చెప్పడమే కాదు.. త్రివిక్రమ్ కూడా అదే పనిలో బిజీగా వున్నారు. ఒక కూల్ ఫ్యామిలీ ఫిలిం, ఒక ఎంటెర్టైన్గింగ్ ఫిలిం, ఒక ఎనేర్జిటిక్ కేరెక్టర్ ఇలాంటివి క్రియేట్ చెయ్యమని త్రివిక్రమ్ తో తారక్ చెప్పాడట. ఇక హీరోయిన్ విషయాని కొచ్చేసరికి త్రివిక్రమ్ మరోసారి పూజ హెగ్డే ని రిపీట్ చేసే విషయంలో తారక్ సుముఖంగా లేడని వినికిడి.

కానీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ని రిపీట్ చేసే విషయంలో తారక్ హ్యాపీగానే ఉన్నాడట. థమన్ విషయంలో సుముఖత చూపుతున్న తారక్.. హీరోయిన్ పూజ హెగ్డే ని రిపీట్ చేసే విషయంలో మాత్రం సుముఖంగా లేడని తెలుస్తుంది. ఇదే విషయం తారక్ త్రివిక్రమ్ కి తేల్చి చెప్పేశాడట. ఇక త్రివిక్రమ్ కూడా తారక్ చెప్పాడు కదా అని.. కొత్త హీరోయిన్ ని తారక్ కోసం వెతికే పనిలో బిజీ అయ్యారట. మరి ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మూవీలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారో  కానీ.. అందరిలో మాత్రం మంచి క్యూరియాసిటీ కనిపిస్తుంది.

Tarak told Trivikram:

Jr NTR to Romance new Heroine

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ