Advertisementt

పాయల్ పాప కోసం కూడా పోటీనా.?

Tue 16th Mar 2021 11:40 AM
payal rajput,bb3,balakrishna,boyapati,ravi teja,khiladi movie,payal item song,khiladi item song,ravi teja khiladi,. balayya bb3  పాయల్ పాప కోసం కూడా పోటీనా.?
Payal is also a competition for sins.? పాయల్ పాప కోసం కూడా పోటీనా.?
Advertisement
Ads by CJ

బాలకృష్ణ - బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న BB3 ( టైటిల్ గాడ్ ఫాదర్) సినిమాలో బాలయ్య కి జోడీగా ప్రగ్య జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే బోయపాటి తన సినిమాల్లో ఓ అదిరిపోయే ఐటెం సాంగ్ పెట్టడం అనేది అలవాటు. ఆ సాంగ్ మాస్ ని ఎంటర్టైన్ చేసేదిగా, అందులో బోయపాటి మార్క్ ఉండేలా చూసుకుంటాడు. అయితే బాలయ్య BB3 లో ఐటెం సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్ ని తీసుకోవాలని అనుకున్నారు. తర్వాత ఆ సాంగ్ కోసం RX 100 భామ పాయల్ రాజ్ ఫుట్ ని ఎంపిక చేశారనే టాక్ నడిచినా క్లారిటీ లేదు. పాయల్ పాప BB3 లో ఐటెం సాంగ్ చెయ్యబోతుంది అనే ప్రచారం జరుగుతుండగానే.. రవితేజ ఖిలాడీలో పాయల్ రాజ్ ఫుట్ ని ఐటెం సాంగ్ కోసం సంప్రదించడం.. దానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగిపోయాయట.

రవితేజ - రమేష్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న ఖిలాడీ మూవీ కూడా BB3 రిలీజ్ రోజునే విడుదల కాబోతుంది. మే 28 న బాలయ్య BB3 - రవితేజ ఖిలాడీ మూవీలు బాక్సాఫీసు ఫైట్ ని షురూ చేసిన విషయం తెలిసిందే. ఇక BB3 లో పాయల్ రాజ్ ఫుట్ ఐటెం సాంగ్ అనుకున్నారు. కానీ రవితేజ ఖిలాడీలో పాయల్ పాపని ఐటెం సాంగ్ కోసం కన్ ఫర్మ్ చేసేసారు. మరి ప్రస్తుతం పెద్దగా క్రేజ్ లేని పాయల్ పాపకి ఈ ఐటెం సాంగ్స్ డిమాండ్ బాగానే ఉంది. అందుకే BB3 టీం - ఖిలాడీ టీం పాయల్ పాప కోసం పోటీ పడుతున్నారు.

Payal is also a competition for sins.?:

Payal Rajput item song for Ravi Teja

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ