Advertisementt

బుమ్రా సీక్రెట్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరంటే

Mon 15th Mar 2021 06:03 PM
jasprit bumrah,anupama parameswaran,bumrah loves sanjana ganesan,bumrah weds sanjana ganesan,jasprit bumrah marries sanjana  బుమ్రా సీక్రెట్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరంటే
Jasprit Bumrah Marries TV Presenter Sanjana Ganesan బుమ్రా సీక్రెట్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరంటే
Advertisement
Ads by CJ

గత నెల రోజులుగా క్రికెటర్ బుమ్రా అంటే క్రికెట్ కన్నా ఎక్కువగా అతని ప్రేమే హైలెట్ అవుతుంది. కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ - బుమ్రా ప్రేమలో ఉన్నారు. పెళ్లి చేసుకోబోతున్నారనే టాక్ నడిచింది. దానికి అనుపమ  పరమేశ్వరన్ తల్లి లైన్ లోకొచ్చి అనుపమ ఎవరిని ప్రేమించడం లేదని తెగేసి చెప్పేసారవిడ. ఇక బుమ్రా మాత్రం ఇంగ్లాండ్ లో ఆడబోయే టెస్ట్ మ్యాచ్ నుండి విరామం తీసుకుని కొన్ని రోజులుగా లో ప్రొఫైయిల్ మెయింటింగ్ చేస్తున్నాడు. అయితే తర్వాత జస్ప్రీత్ బుమ్రా ఓ స్పోర్ట్స్ ఛానల్ లో యాంకర్ గా చేస్తున్న సంజన గణేశన్ తో ప్రేమలో ఉన్నాడనే టాక్ మొదలయ్యింది. ఇక అందరూ ఆ సంజన గణేశన్ వివరాలు గూగుల్ లో వెతికేలోపు బుమ్రా - సంజన గణేశన్ ల పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలోకెక్కాయి.

జస్ప్రీత్ బుమ్రా - సంజన గణేశన్ లు ఈ రోజు గోవా లో పెళ్లి చేసుకున్నారు. పెళ్ళికి హాజరయిన ఫ్రెండ్స్, సన్నిహితులు, కుటుంబ సభ్యులకు కనీసం ఫోన్ కూడా పెళ్లి మండపం లోకి ఎలోవ్ చేయలేదంటే బుమ్రా పెళ్లి ఏర్పాట్లు ఎంత పకడ్బందీగా జరిగాయో అర్ధమవుతుంది. పెళ్లయ్యేవరకు ఎలాంటి విషయాలను బయటికి రాకుండా గోప్యంగా ఉంచిన బుమ్రా పెళ్లి కాగానే తన ఇష్టసఖికి తాళి కట్టిన ఫొటోస్ ని రిలీజ్ చేసాడు. మేము మా కొత్త ప్రయాణంలోకి అడుగు పెట్టాం. మా కొత్త జీవితాన్ని ప్రారంభించాం. ఈ రోజు మా జీవితాల్లో అత్యంత సంతోషకరమైన రోజు.. ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాము అంటూ చేసిన బుమ్రా ట్వీట్ తో బుమ్రా పెళ్లి విషయం బయటికి వచ్చేసింది. ప్రస్తుతం బుమ్రా - సంజన పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Jasprit Bumrah Marries TV Presenter Sanjana Ganesan:

Jasprit Bumrah marries sports presenter Sanjana Ganesan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ