Advertisementt

సీత గా అలియా ఆగయా

Mon 15th Mar 2021 11:52 AM
rrr movie,alia bhatt first look as sita,sita as alia bhatt,alia bhatt birthday special,rrr look,ntr,rajamouli,tarak,ram charan,rrr pan india film  సీత గా అలియా ఆగయా
Alia Bhatt First Look As Sita In RRR సీత గా అలియా ఆగయా
Advertisement
Ads by CJ

RRR నుండి ఎగ్జైటింగ్ అప్ డేట్ వచ్చేసింది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో సీత పాత్రలో నటిస్తున్న అలియా భట్ సీత కేరెక్టర్ ని రివీల్ చేసేసింది RRR టీం. నేడు అలియా భట్ పుట్టిన రోజు స్పెషల్ సర్ప్రైజ్ గా అలియా సీత లుక్ ని వదిలింది టీం. మరి ఇప్పటివరకు ఎక్కువగా గ్లామర్ గానే హైలెట్ అయిన అలియా భట్ సీత లుక్ పై అందరిలో క్యూరియాసిటీ ఉంది. అందులోనూ మెగా ఫాన్స్ లో మరికాస్త ఎక్కువ. ఎందుకంటే అల్లూరి సీత రామరాజు కేరెక్టర్ చేస్తున్న రామ్ చరణ్ పక్కన అలియా భట్ ఎలా ఉండబోతుంది? ఎలా ఉంటుంది? వీరి కాంబో ని చూడాలనే ఆతృతలో మెగా ఫాన్స్ ఉన్నారు. గత రెండు రోజులుగా అటు చరణ్ ఫాన్స్, ఇటు RRR ఫాన్స్ మధ్యలో అలియా భట్ అభిమానులే కాదు.. యావత్ ఇండియా మొత్తం RRR లో సీత లుక్ కోసం వెయిటింగ్. 

కొమరం భీం గా ఎన్టీఆర్, అల్లూరిగా రామ చరణ్ లుక్స్ మాత్రమే చూసిన అభిమానులకి ఇప్పుడు సీత లుక్ చూసే క్షణం వచ్చేసింది. సీత గా అలియా లుక్ అదిరిపోయింది. చీర, జాకెట్టులో సీత గా ఒదిగిపోయింది అలియా. తన రామ రాజు కోసం సీత ఎదురు చూపులు కనిపిస్తున్నాయి ఆ లుక్ లో. మెడలో మాంగల్యంతో గ్రీన్ కలర్ సారీ లో.. పెద్ద బొట్టుతో.. ఎదురుగా పూల సజ్జా, చుట్టూ దీపపు కుందేలు మధ్యన సీత గా అలియా వెలిగిపోతుంది. అలియా సీత లుక్ చూసిన వారు.. ఎంతగా వర్ణించిన తనివి తీరదు సుమీ అనేస్తారు. అంత పద్దతిగా RRR లో సీతగా అలియా కనిపిస్తుంది. దీక్షతో, పట్టుదలతో, దృఢ సంకల్పంతో సీత రామ రాజు కోసం చూసే చూపుల్లో నిరీక్షణ, బాధ కనిపిస్తున్నాయి. మరి అలియా భట్ పుటిన రోజునాడు రాజమౌళి అందరిని బిగ్ సర్ప్రైజ్ చేశారు. ప్రస్తుతం సీత గా అలియా భట్ లుక్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు. RRR సీత లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

Alia Bhatt First Look As Sita In RRR:

Alia Bhatt First Look As Strong Willed Sita In RRR

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ