కొంతమందికి ఫేమ్ వస్తే చాలు.. ఆ క్రేజ్ తో అవకాశాలు వచ్చేస్తాయి.. ఆటోమాటిక్ గా పారితోషకాలు పెరిగిపోతాయి. కొంతమంది ఒక్క సినిమా హిట్ పడగానే డిమాండ్స్ మొదలు పెట్టేస్తారు. ఇక ఏదైనా సినిమా హిట్ అయ్యింది అనగానే.. వెంటనే ఆ హీరో పారితోషకం పెంచేసాడు, హీరోయిన్ పారితోషకం పెంచేసింది. డైరెక్టర్ కి కమిట్మెంట్స్, అడ్వాన్స్ లు అమ్మో అంటూ సోషల్ మీడియాలో న్యూస్ లు వరసగా ప్రచారంలోకి రావడం అనేది కామన్. రీసెంట్ గా జాతి రత్నాల హీరో నవీన్ పోలిశెట్టి క్రేజ్ బాగా పెరిగింది. ఏజెంట్ సాయి శ్రీవాస ఆత్రేయ హిట్ అయినా.. జాతి రత్నాలకు లాంగ్ గ్యాప్ వచ్చేసింది. జాతి రత్నాలు సినిమా మీద యూనిట్, హీరో, కమెడియన్స్ చేసిన పబ్లిసిటీ, సినిమాలో కంటెంట్ అన్ని జాతి రత్నాలను వేరే లెవెల్ లో కూర్చోబెట్టాయి.
జాతి రత్నాలు హిట్ అవగానే హీరో నవీన్ పోలిశెట్టి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దానితో రెండు బిగ్ ప్రొడక్షన్ హౌస్ లు నవీన్ హీరోగా సినిమాలు అనౌన్స్ చెయ్యడానికి రెడీ అయ్యాయి. టాప్ బ్యానర్ యూవీ క్రియేషన్స్, మంచి చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్స్ సితార ఎంటర్టైన్మెంట్ వాళ్ళు నవీన్ ని సంప్రదించగా.. నవీన్ పోలిశెట్టి వెంటనే అంగీకరించేసాడట. మరి ఆఫర్ ఇచ్చిన బ్యానెర్లు అల్లాటప్పావి కాదు కదా. ఒక్కో సినిమాకి నవీన్ పోలిశెట్టి కి మూడు నుండి నాలుగు కోట్లు ఆఫర్ చేశాయట ఆ నిర్మాణ సంస్థలు. అయితే నవీన్ పోలిశెట్టి మాత్రం మనీ ఇంపార్టెంట్ కాదు.. మనకి కథలో బలం ఉండాలి, మంచి డైరెక్టర్ ఉండాలి అని చెప్పడంతో నిర్మాతలే షాకయ్యారట.
ఎందుకంటే ఇంత గొప్ప హిట్ కొట్టాక పారితోషకం విషయంలో హీరో ఇలా మాట్లాడడం అనేది ఈమధ్య కాలంలో ఎప్పుడూ చూడలేదు అనుకుంటున్నారట వాళ్ళు.