ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది కృతి శెట్టి. ఆ సినిమా సాంగ్ రిలీజ్ కాగానే కృతి శెట్టి లుక్స్ కి హీరోలు ఫిదా.. దానితో ఉప్పెన రిలీజ్ కాకుండానే కృతి శెట్టి కి ఆఫర్ క్యూ కట్టాయి. నాని, సుధీర్ బాబు సినిమాలతో కృతి శెట్టి యంగ్ హీరోయిన్స్ కి షాకిచ్చింది. అంతేకాదు.. ఉప్పెన విడుదలయ్యిందో.. లేదో.. రామ్ సరసన బైలింగువల్ మూవీ లో అవకాశం పట్టేసింది. ఒక్క సినిమా కృతి శెట్టి కెరీర్ ని మలుపులు తిప్పింది. మరి ఆ హీరోయిన్ అదృష్టం గురించి సోషల్ మీడియా ఇంకా మాట్లాడుకుంటుండగానే ఇప్పుడు మరో డెబ్యూ హీరోయిన్ కి లక్కీ అవకాశాలు క్యూ కడుతున్నాయి.
ఆమె జాతి రత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. జాతి రత్నాలు సినిమా సక్సెస్ అవడమే కాదు.. ఆ సినిమా విడుదలకు ముందు నుండే జాతి రత్నాల ప్రమోషన్స్ లో ఫరియా డాన్స్, ఆమె లుక్స్ చూసిన హీరోలు ఆమెకి ఆఫర్స్ ఇవ్వబోతున్నారనే టాక్ మొదలైంది. అందులోనూ సినిమా సూపర్ హిట్ అవడంతో ఫరియా కి అవకాశాల వెల్లువ మొదలైనట్టుగా చెబుతున్నారు. హైట్ ఎక్కువగా ఉన్న.. ఫరియాని నాగ్ అశ్విన్ ఓ కాలేజ్ ఈవెంట్ లో చూసి జాతి రత్నాల ఆఫర్ ఇచ్చాడట. ఇప్పుడా సినిమా హిట్. పాపకి అదృష్టం అలా కలసి రాగా.. ఇప్పుడు రవితేజ సినిమాలో ఫరియా అబ్దుల్లా అవకాశం కొట్టేసిందట. రవితేజ ప్రస్తుతం ఖిలాడీ మూవీ చేస్తున్నాడు. తదుపరి కిషోర్ తిరుమల తో చెయ్యబోయే సినిమాలో రవితేజకి జోడిగా ఫరియా అబ్దుల్లాని మేకర్స్ అప్రోచ్ అవడం పాప ఓకె చెప్పడం జరిగింది అనే టాక్ ప్రచారంలోకొచ్చింది.