ఇద్దరూ ఒకే సినిమాలో ఒకేలాంటి పాత్రలతో సినిమాల్లో కనిపించారు. శేఖర్ కమ్ముల దగ్గరకి హీరో ఆడిషన్స్ కి వెళితే మీరు రిచ్ బాయ్స్ ల ఉన్నారు.. కాబట్టి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో గోల్డ్ ఫేస్ బాయ్స్ లా నటించామన్నారని చెప్పిన నవీన్ పోలిశెట్టి, విజయ్ దేవేరకొండలు ఆ సినిమా తర్వాత సోలో హీరోలుగా కెరీర్ కి బాటలు వేసుకున్నారు. విజయ్ దేవరకొండ పెళ్లి చూపులతో హీరోగా హిట్ కొట్టి.. గీత గోవిందం లాంటి సినిమాతో స్టార్ హీరో అయిపోయాడు. ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా సినిమాలు చేస్తున్న విజయ్ రౌడీ స్టార్ గా తెగ ఫెమస్ అయ్యాడు. ప్రస్తుతం లైగర్ పాన్ ఇండియా ఫిలిం చేస్తున్న విజయ్ దేవరకొండ క్రేజ్ టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు విపరీతంగా ఉంది.
మరి అదే గోల్డ్ ఫేస్ బాయ్స్ లో ఒకడిగా నటించిన నవీన్ పోలిశెట్టి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో హీరోగా మంచి హిట్ కొట్టాడు. యూట్యూబ్ వీడియోస్ చేస్తూ పాపులర్ అయిన నవీన్ పోలిశెట్టి కామెడీ పాత్రలతో హైలెట్ అవ్వాలని అనుకుంటున్నాడు. అటు బాలీవుడ్ లోనూ నవీన్ చిచ్చోరె తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక రీసెంట్ గా జాతి రత్నాలు సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నవీన్ పోలిశెట్టి కూడా విజయ్ అంత స్టార్ అవుతాడా? ప్రెజెంట్ విజయ్ స్టార్ డమ్ లాంటి స్టార్ డమ్ నవీన్ కూడా ఎంజాయ్ చేస్తున్నాడా? విజయ్ క్రేజ్ ని రీచ్ అవ్వాలంటే నవీన్ పోలిశెట్టికి ఎంత టైం పడుతుంది? విజయ్ రౌడీ బ్రాండ్స్ తో ఎక్కువ పాపులర్ అయ్యాడు? మరి నవీన్ కేవలం సినిమాలతో విజయ్ ని రీచ్ అవుతాడా? అంటూ నవీన్ పోలిశెట్టికి విజయ్ దేవరకొండ కి లింక్ పెట్టి చర్చలకు తెర లేపారు నెటిజెన్స్.