Advertisementt

డ్రగ్స్ కేసు: హీరో తనీష్ ఆవేదన

Sat 13th Mar 2021 02:43 PM
hero tanish,drugs case,tanish reacts,notice,tanish drugs case  డ్రగ్స్ కేసు: హీరో తనీష్ ఆవేదన
Actor Tanish Reacts On Notice In Drugs Case డ్రగ్స్ కేసు: హీరో తనీష్ ఆవేదన
Advertisement
Ads by CJ

బెంగ‌ళూరు నిర్మాతతో సంబంధాలు అంటూ యువ‌హీరో త‌నీష్ పై ప‌లు చానెళ్లు క‌థ‌నాలు ప్రచారం చేయ‌‌డాన్ని ఆయన ఓ వీడియో ద్వారా  ఖండించారు. డ్ర‌గ్స్ కేసులో నోటీసులు అంటూ ఇష్టానుసారం ప్ర‌చారం చేసేశారు. ఇందులో నిజానిజాలేమిటో తెలుసుకునేందుకు క‌నీసం న‌న్ను సంప్ర‌దించ‌లేదు.. నా కుటుంబాన్ని ఆ వార్త‌లు తీవ్రంగా బాధించాయి అంటూ వాపోయారు యువ‌హీరో త‌నీష్‌. బెంగ‌ళూరు నిర్మాత‌కు డ్ర‌గ్స్ కేసులో నోటీసులు వ‌చ్చిన మాట నిజం. నాకు నోటీసు వ‌చ్చింది. కానీ నాకు వ‌చ్చిన నోటీసు అర్థం ఏమిటో తెలుసుకోకుండా ఇష్టానుసారం కొన్ని మీడియాలు ప్ర‌చారం చేయ‌డం నా కుటుంబాన్ని బాధించింద‌ని త‌నీష్‌ అన్నారు. అస‌లు బెంగ‌ళూరు నిర్మాత‌తో రెండేళ్లుగా ఎలాంటి సంప్ర‌దింపులు లేవు అని తెలిపారు.

ఈ కేసులో నాకు వ‌చ్చిన నోటీసుకు కార‌ణం వేరు. ఫలానా వివ‌రం మీకు తెలుసా.. తెలిస్తే చెప్పండి! అని మాత్ర‌మే అడిగేందుకు ఆ నోటీస్ ఇచ్చారు. నేను ఇందులో ఇన్వాల్వ్ అయ్యాన‌ని నోటీస్ పంప‌లేదు.. ఇది తెలుసుకోకుండా కొన్ని మీడియాలు ఇష్టానుసారం క‌థ‌నాలు అల్లేశాయి. నేను నా కుటుంబం చాలా క‌ల‌త‌కు గుర‌య్యాం. ద‌య‌చేసి ఇలాంటి అస‌త్య ప్ర‌చారం చేయొద్దు. కొన్ని మీడియాలు న‌న్ను సంప్ర‌దించి న్యాయ‌బ‌ద్ధంగా నిజాల్ని ప్ర‌చురించాయ‌ని త‌నీష్ ఈ సంద‌ర్భంగా తెలిపారు. బెంగ‌ళూరు నిర్మాత నాతో సినిమా చేస్తానంటూ గ‌తంలో సంప్ర‌దించిన మాట నిజం. కానీ ఆ ప్రాజెక్ట్ టేకాఫ్ కాలేదు. రెండేళ్లుగా ఆయ‌న‌తో ఎలాంటి కాంటాక్టులోనూ లేను. అవ‌కాశాల కోసం ఎంద‌రినో క‌లుస్తుంటాం. అభ్య‌ర్థిస్తుంటాం. కానీ ఆయ‌న‌తో నాకు ఎలాంటి సంబంధాలు లేవు.. అని త‌నీష్ ఓ వీడియో ద్వారా వివ‌ర‌ణ ఇచ్చారు. ద‌య‌చేసి అస‌త్యాలు ప్ర‌చారం చేయొద్ద‌ని కోరారు.

Actor Tanish Reacts On Notice In Drugs Case:

Tanish Reacts On Notice In Drugs Case

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ