అర్జున్ రెడ్డి సినిమా తర్వాత నుండి మహేష్ బాబు ని డైరెక్ట్ చెయ్యాలనే కోరిక, కల సందీప్ వంగాకి నెరవేరడం లేదు. సూపర్ స్టార్ నో అన్నాడని అర్జున్ రెడ్డినే బాలీవుడ్ లో రీమేక్ చేసి హిట్ కొట్టినా మహేష్ తో మూవీ ఆఫర్ దొరకలేదు. మళ్ళీ బాలీవుడ్ లోనే రణబీర్ కపూర్ తో యానిమల్ మూవీని డైరెక్ట చెయ్యబోతున్న సందీప్ వంగాకి మహేష్ తో పని చేసే అవకాశం ఎట్టకేలకి లభించింది. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో ఉన్న మహేష్ బాబు ఆ సినిమా తర్వాత రాజమౌళి తో మరో సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. అయితే రాజమౌళి RRR తర్వాత తీసుకోబోయే గ్యాప్ లో మహేష్ మరో సినిమా చేస్తాడనే టాక్ ఉంది.
దానికి సందీప్ వంగా దర్శకత్వం వహిస్తాడేమో అనుకుంటున్నారేమేమో.. సందీప్ వంగాకి మహేష్ అవకాశం ఇచ్చింది సినిమాకి కాదండోయ్.. జస్ట్ ఓ యాడ్ షూట్ కి మాత్రమే. మహేష్ బాబు అటు సినిమాలు ఇటు కమర్షియల్ యాడ్స్ చేస్తుంటాడనే విషయం తెలిసిందే. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎక్కువ యాడ్ షూట్స్ చేసిన మహేష్ ఇప్పుడు అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ తో ఒక కమర్షియల్ యాడ్ చేయబోతున్నాడట. ఆ యాడ్ షూట్ కూడా ఒక్క రోజే ఉండబోతుంది అని తెలుస్తుంది.