రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబోలో ఆర్.ఆర్.ఆర్ స్టార్ట్ అయినప్పటినుండి ఈ సినిమాపై ఎన్ని ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయో అందరికి తెలిసిందే. అండ్ ఎస్ ఎస్ రాజమౌళి మచ్ అవైటెడ్ ఫిలిం కూడా. ఎంటైర్ ఇండియా ఆయన దగ్గరనుండి రాబోయే సినిమా కోసం ఎదురు చూస్తుంది. రాజమౌళి ఏరి కోరి మరీ ఎంచుకున్న ఇద్దరు హీరోలు. ఈ కథాంశం ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది. ఓకె స్టేట్ లో ఇద్దరు స్టార్ హీరోస్. రెండు కాంపౌండ్స్.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కొట్టుకునే అభిమానులు.. ఇలాంటి వాటినన్నిటిని రాజమౌళి ఎలా హ్యాండిల్ చేస్తూ.. ఇద్దరు స్టార్స్ ను బ్యాలెన్స్ చేస్తూ.. ఒక బిగ్గెస్ట్ ఎక్స్ట్రా రేంజ్ మూవీని ప్లాన్ చేసారు.
అటు ఎన్టీఆర్ 100 కోట్ల మార్కెట్ కలిగిన హీరో, ఇటు రామ్ చరణ్ 100 కోట్ల మార్కెట్ కలిగిన హీరో. ఇలా ఇద్దరి మీద వందల కోట్ల పెట్టుబడి పెట్టి తెరకెక్కిస్తున్న సినిమాపై అందరిలో అనుమానాలున్నాయి. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో స్టార్ హీరోల ఫాన్స్.. మా హీరోదే అప్పర్ హ్యాండ్, కాదు మా హీరోదే అప్పర్ హ్యాండ్ అంటూ రచ్చ చేస్తున్న విషయమూ తెలిసిందే. కానీ రీసెంట్ గా తెలుస్తున్న విషయం ఏమిటంటే.. ఆర్.ఆర్.ఆర్ లో యాక్షన్ పార్ట్ రామ్ చరణ్ కి ఇచ్చేసి.. పెరఫార్మెన్స్ స్కోప్ మొత్తం తారక్ కి కేటాయించారట రాజమౌళి. ఎందుకంటే రామ్ చరణ్ అల్లూరి కేరెక్టర్ లో రెండే వేరియేషన్స్ ఉంటాయి. అది కూడా యాక్షన్ పార్ట్ బేస్ చేసుకుని ఉంటుంది.
కానీ తారక్ కొమరం భీం కేరెక్టర్ లో మూడు నాలుగు వేరియేషన్స్ ఉంటాయి. పెరఫార్మెన్స్ కి స్కోప్ కి ఉన్న కేరెక్టర్, ఎమోషనల్ గా ఎక్కువ స్పేస్ తీసుకునే కేరెక్టర్ తారక్ చెయ్యబోతున్నాడు. ఆర్.ఆర్.ఆర్ విడుదలయ్యాక ప్రేక్షకుల మదిలో, అభిమానుల గుండెల్లో యాక్షన్ హీరోగా రామ్ చరణ్ గుర్తుండిపోతే.. ఎక్సట్రార్డినరీ పెరఫార్మెర్ గా తారక్ గుర్తుండిపోతాడు అని తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజమో.. ఇలాంటివన్నీ సినిమా మొదలైనప్పటి నుండి వినిపిస్తున్న విషయాలే కాబట్టి ఇప్పటికైతే ఇది నిజమే అనుకుందాం. నిజమేమిటో తెలుసుకునే వరకు వెయిట్ చేద్దాం.