టాలీవుడ్ టాప్ హీరోయిన్ - అలాగే సీనియర్స్ లిస్ట్ లోకెళ్ళిన హీరోయిన్ ఒకే స్కూల్ లో చదువుకున్నారన్న ఆసక్తికర విషయాన్నీ బయట పెట్టింది క్యూట్ హీరోయిన్ పూజ హెగ్డే. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా టాలీవుడ్ ని దున్నేస్తున్న పూజ హెగ్డే, కాస్త క్రేజ్ తగ్గి.. సీనియర్స్ లిస్ట్ లో చేరిన తమన్నా ఒకే స్కూల్ లో చదువుకున్న విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయట పెటింది పూజ హెగ్డే. తమన్నా తాను చదువుకున్న స్కూల్ లో సీనియర్ అని, చాలా అందంగా ఉండేదని, స్కూల్ లో జరిగే అన్ని ప్రోగ్రామ్స్ లో తమన్నా పార్టిసిపేట్ చేసేదని చెబుతుంది పూజ.
తమన్నా స్కూల్ ప్రోగ్రామ్స్ లో డాన్స్ చేసేదని.. అంతేకాకుండా ప్రతి ఒక్కరితో చక్కగా కలిసిపోయేదని, ఎవ్వరినైనా ఒకేలా చూసేదని చెబుతుంది పూజ హెగ్డే. తమన్నా అందరితో ఫ్రెండ్లిగా ఉండేదని.. తమన్నాలోని కలివిడితనం తనకు ఎంతో నచ్చుతుందని.. ట్రెడిషనల్ గాను, గ్లామర్ డ్రెస్సుల్లో తమన్నా చాలా అందంగా ఉంటుంది అంటూ తన సీనియర్ స్కూల్ మేట్ ని పూజ హెగ్డే పొగిడేస్తోంది. ప్రస్తుతం యంగ్ అండ్ స్టార్ హీరోస్ మూవీస్ తో బిజీగా ఉన్న పూజ హెగ్డే బాలీవుడ్ లో మరింత బిజీగా మారితే.. తమన్నా గోపీచంద్ సరసన సీటిమార్ లో నటిస్తుంది.