Advertisementt

శంకర్ - చరణ్ మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్

Fri 12th Mar 2021 01:38 PM
ram charan,rrr pan india film,charan - shankar combo,pan india film,rajamouli,ram charan next,dil raju - ram charan - shankar combo,ram charan - surya multi starrer movie,ram charan - shankar multi starrer movie  శంకర్ - చరణ్ మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్
Shankar - Charan Music Director Fix శంకర్ - చరణ్ మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్
Advertisement
Ads by CJ

ఆర్.ఆర్.ఆర్ తర్వాత రామ్ చరణ్ చెయ్యబోయే మూవీపై అందరిలో ఆసక్తి నెలకొన్న టైం లో రకరకాల దర్శకుల పేర్లు రామ్ చరణ్ నెక్స్ట్ విషయంలో వినిపించినా.. రామ్ చరణ్ ఆర్. ఆర్. ఆర్ తర్వాత మళ్ళీ పాన్ ఇండియా ఫిలిం కే మొగ్గు చూపించాడు. దానితో కోలీవుడ్ దర్శకుడు శంకర్ తో రామ్ చరణ్ నెక్స్ట్ ఫిలిం ని బడా నిర్మాత దిల్ రాజు సెట్ చేసాడు. భారీ బడ్జెట్ తో మల్టీస్టారర్ గా ఉండబోతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటుగా మరో స్టార్ హీరో అంటే కోలీవుడ్ హీరో సూర్య నటించబోతున్న విషయం తెలిసిందే. సూర్య - రామ్ చరణ్ కాంబోలో డైరెక్టర్ శంకర్ పాన్ ఇండియాని షేక్ చెయ్యబోతున్నారు.

ఈ అదిరిపోయే కాంబినేషన్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా రెహ్మాన్, ఎస్.ఎస్.థమన్ పేర్లు వినిపించినా ఫైనల్ గా తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ని క్రేజీ కాంబో పాన్ ఇండియా ఫిలిం కి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేసారని సన్నహిత వర్గాల సమాచారం. అంటే శంకర్ - రామ్ చరణ్ - సూర్య కాంబో మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ ఫిక్స్ అట. ఈ విషయాన్నీ త్వరలోనే అధికారికంగా తెలియజేస్తారని సమాచారం. ఇప్పటి నుండే అనిరుద్ శంకర్ - రామ్ చరణ్ మూవీపై వర్క్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడట. ఇక దిల్ రాజు బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఫస్ట్ మూవీ ఈ మల్టీస్టారర్ కావడంతో అందరిలో ఈ సినిమాపై మంచి క్యూరియాసిటీ, ట్రేడ్ లోని భారీ అంచనాలు ఉన్నాయి.

Shankar - Charan Music Director Fix:

Music director confirmed for Shankar - Ram Charan film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ