మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన ఉప్పెన సినిమా ఫిబ్రవరి 12 న విడుదలై బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోయింది. దానితో మెగా హీరో వైష్ణవ్ తేజ్ సహా హీరోయిన్, దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ ని సూపర్ స్టార్ మహేష్ దగ్గరనుండి మెగా హీరోలైన రామ్ చరణ్ ఇలా అందరూ అభినందనలతో ముంచెత్తారు. కానీ మరో మెగా హీరో అల్లు అర్జున్ ఉప్పెన సినిమా రిలీజ్ అయిన నెల వరకు ఆ సినిమాని చూసి స్పందించకపోవడం పట్ల సోషల్ మీడియాలో ట్రోల్స్ నడిచాయి. ఉప్పెన సినిమా చూసే తీరిక లేదా? లేదంటే మెగా హీరో ని అభినందించడం ఎందుకులే.. అని బన్నీ ఇలా చేశాడా? అంటూ మెగా ఫాన్స్ ఫైర్ అయ్యారు. ఇక కూల్ గా నెల రోజుల తర్వాత ఉప్పెన టీం ని అభినందించాడు అల్లు అర్జున్.
మరి నిన్న విడుదలైన జాతి రత్నాలు సినిమాని అదే రోజు నైట్ అంటే నిన్న రాత్రి చూసేసిన అల్లు అర్జున్ ఆ సినిమాపై ప్రశంశల వర్షం కురిపించడం పట్ల మెగా ఫాన్స్ గుర్రుగా ఉన్నారు. నవీన్ పోలిశెట్టి - ప్రియదర్శి - రాహుల్ రామ కృష్ణ కాంబోలో తెరకెక్కిన జాతి రత్నాలు టైటిల్ కి తగ్గట్టే.. జాతి రత్నాలుగా సక్సెస్ కొట్టారు. సినిమా విడుదలైన కాసేపటికే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవడంతో సినిమా కి హిట్ టాక్ పడిపోయింది. ఇక గత రాత్రి జాతి రత్నాలు చూసిన అల్లు అర్జున్ ఈ రోజు ఉదయమే ట్వీట్ల వర్షం కురిపించాడు. రాత్రే ఈ సినిమా చూసాను. టీమ్ మొత్తానికి కంగ్రాట్స్. ఒక సినిమాను చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఈ మధ్య కాలంలో ఇంతలా నవ్వలేదు.
నవీస్ పొలిశెట్టి నువ్వు నీ నటనతో అదరగొట్టేశావు. రాహుల్ నువ్వు చాలా బ్రిలియంట్‌గా చేశావు. ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా అభినందించదగ్గ నటులు అంటూ ట్వీట్ చెయ్యడమే కాదు.. టెక్నీకల్ టీం ని పేరు పేరునా అల్లు అర్జున్ అభినందించాడు. జాతి రత్నాలు కథను నమ్మించినందుకు అశ్వనీదత్, స్వప్నా సినిమాను, ప్రియాంక దత్, దత్ గారికి నా రెస్పెక్ట్. ఇక చివరిగా దర్శకుడు అనుదీప్ ఇంతిలా ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసిన నీకు నా రెస్పెక్ట్. మీ బ్రెయిన్‌ని స్విచ్ఛాఫ్ చేసి.. జాతి రత్నాలు సినిమాను వెళ్లి ఫన్‌ని ఎంజాయ్ చెయ్యండి అంటూ ట్వీట్ చెయ్యడం చూసిన మెగా ఫాన్స్.. ఉప్పెనకి అలా జాతి రత్నాలకు ఇలా..ఇదేంటి బన్నీ ఇలా చేసావ్ అంటున్నారు.