రామ్ రెడ్ సినిమా తర్వాత తమిళ్ దర్శకుడు లింగుస్వామితో ఓ బైలింగువల్ మూవీని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆల్రెడీ ఒకసారి అల్లు అర్జున్ ఆఫీషియల్ ప్రెస్ మీట్ పెట్టి మరీ లింగుస్వామి దర్శకత్వంలో బైలింగువల్ ఫిలిం చేయబోతున్నట్లుగా ఎనౌన్స్ చేసాడు. దాని తర్వాత కొన్ని అంతర్గత కారణాల రీత్యా ఆ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అవ్వలేదు. తర్వాత లింగుస్వామి విశాల్ తో పందెం కోడి 2 సినిమా చేసాడు. అయితే అప్పుడు బన్నీకి చెప్పిన కథ, మన తెలుగు నేటివిటీకి సెట్ అవుతుంది అనుకుని తయారు చేసుకున్న స్క్రిప్ట్ కానీ, ఆ కేరెక్టరైజేషన్ అలానే ఉంది. అదే ఇప్పుడు లింగుస్వామి డైరెక్షన్ లో హీరో రామ్ ఓకె చేసిన స్క్రిప్ట్. అది మెటీరియలైజ్ కాబోతుంది.
లింగుస్వామి అల్లు అర్జున్ ని మైండ్ లో పెట్టుకుని డిజైన్ చేసుకున్నవన్నీ రామ్ చేస్తాడా? చేయగలడా? డాన్స్ విషయంలో అల్లు అర్జున్ తో పోటీ పడే రామ్, స్టైలింగ్ విషయంలోనూ ఎప్పుడు అల్లు అర్జున్ తో పోటీ పడే రామ్.. పెరఫార్మెన్స్ విషయంలోనూ, స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలోనూ తనని తాను ప్రూవ్ చేసుకుంటాడా? ఇలాంటి ఓ ఆపర్చ్యునిటీని కరెక్ట్ గా రామ్ వాడుకుంటాడా? చూద్దాం రామ్ లింగుస్వామి దర్శకత్వంలో బైలింగువల్ మూవీలో ఏం చేస్తాడో? ఏం చెయ్యబోతున్నాడో? అనేది.