Advertisementt

ఈ సినిమా రిజల్ట్ విషయంలో డౌట్ లేదు

Thu 11th Mar 2021 12:14 PM
nithin,rang de movie,nithin rang de movie,rang de release date,nithin check movie,check movie result,rang de movie review  ఈ సినిమా రిజల్ట్ విషయంలో డౌట్ లేదు
There is no doubt about the outcome of this film ఈ సినిమా రిజల్ట్ విషయంలో డౌట్ లేదు
Advertisement
Ads by CJ

నితిన్ - చంద్ర శేఖర్ యేలేటి కాంబోలో తెరకెక్కిన చెక్ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎప్పటిలానే చంద్ర శేఖర్ యేలేటి సినిమాలలాగా.. మంచి ఎఫర్ట్ అనిపించుకుంది. మంచి కాన్సెప్ట్ అనిపించుకుంది. మంచి టెక్నీకల్ ప్రెజెంటేషన్ అనిపించుకుంది. కానీ కమర్షియల్ రిజల్ట్ విషయంలో మాత్రం అది కూడా ఎప్పటిలానే అంటే ఎప్పుడూ వచ్చే రిజల్టే వచ్చింది. అది చంద్ర శేఖర్ యేలేటికి నిరాశ కలిగించే అంశం కావచ్చు. కానీ నితిన్ మాత్రం దానికి ముందే ప్రిపేర్ అయ్యి ఉన్నాడనే విషయం.. ఆ సినిమా ప్రమోషన్స్ లోనే అతను ఇచ్చిన ఇంటర్వ్యూలోనే తెలిసిపోయింది. ఆ డైరెక్టర్ పై రెస్పెక్ట్ తోనో.. లేదూ ఆ టైం లో ఆ కాన్సెప్ట్ నచ్చి నితిన్ అలా ట్రావెల్ చేసాడో.. ఆ సినిమా చేసేసిన నితిన్ తన హోప్స్ మాత్రం కంప్లీట్ గా రంగ్ దే మీదే పెట్టుకున్నాడు.

తనకి నచ్చిన డైరెక్టర్, తనకి బాగా నచ్చిన స్క్రిప్ట్, తనకి బాగా కెమిస్ట్రీ కుదిరిన హీరోయిన్.. అన్నిటికి మించి తనని బాగా అందంగా చూపించే పీసీ శ్రీరామ్ లాంటి కెమెరా మ్యాన్.. ఇలా అన్ని రకాలుగా కూడా రంగ్ దే నితిన్ కి ఇచ్చిన ఎనేర్జి.. చెక్ ఇవ్వలేకపోయింది అనేది వాస్తవం. రంగ్ దే సినిమా విషయంలో అటు మ్యూజికల్ గా కానీ, ఇటు విజువల్ గా కానీ.. రిజల్ట్ పరంగాను అన్ని రకాలుగా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న నితిన్.. ఈ రంగ్ దే విషయంలో డౌటే లేదు.. పక్కా హిట్ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. నిజానికి ట్రేడ్ లో గాని, ఇండస్ట్రీలో కానీ ఈ సినిమాపై బజ్ చూస్తుంటే నితిన్ కాన్ఫిడెంట్ కరెక్ట్ అనిపిస్తుంది. రంగ్ దే బాక్సాఫీసుకు చెక్ దే చెప్పి.. నితిన్ కి మళ్ళీ కొత్త రంగులద్దుతుంది.. ఇది తథ్యం. 

There is no doubt about the outcome of this film:

Nithin Rang De Movie to Release on March 26th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ