నాగార్జున బాగా ఇష్టపడి చాలా ఈజీగా తనదైన స్టయిల్లో పెర్ఫర్మ్ చేసిన కేరెక్టర్ బంగార్రాజు. సోగ్గాడే చిన్న నాయన సినిమాలో నాగార్జున పంచెకట్టు తో అదిరిపోయే నటన తో ఆకట్టుకున్నాడు. మా నాన్న గారి పంచెలు వాడాను ఈ సినిమా కోసం.. అని మరీ చెప్పుకుంటూ పంచెకట్టు కట్టుకుని గ్రామీణ వాతావరణంలో సంక్రాంతి పండగకి వచ్చి సందడి చేసాడు. నెంబర్ ఆఫ్ హీరోయిన్స్ తో రొమాంటిక్ హీరోగా తనకున్న ఇమేజ్ ని ప్రూవ్ చేసుకున్నాడు. అది ఆ సీజన్ కి సోగ్గాడే చిన్ని నాయన పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయిన సినిమాగా.. 50 కోట్ల సినిమాగా నిలిచింది. ఒకవైపు ఇంకో రెండు పెద్ద సినిమాలున్నా కూడా.. ఆ సీజన్ కి సోగ్గాడే చిన్ని నాయన పెద్ద సినిమాగా నిలిచింది.
అప్పటినుండి సోగ్గాడే చిన్ననాయన కేరెక్టర్ బంగార్రాజు టైటిల్ తో సినిమా చేద్దామని తాపత్రయపడుతున్నారు నాగార్జున. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి బన్నీ, మహేష్ సినిమాలు ఉన్నాయి. అలాగే బంగార్రాజు సినిమా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కి ఉన్న పర్సనల్ ప్రాబ్లమ్స్ వలన ఆ సీజన్ ని లైట్ తీసుకున్నారు నాగ్. ఇక వచ్చే సంక్రాతి సీజన్ కి అయినా వద్దామనుకుని నాగార్జున హోప్స్ పెట్టుకుంటే.. ఒకవైపు మహేష్ మరోవైపు పవన్ కళ్యాణ్ ఆల్రెడీ కచ్చిఫ్ వేశారు. మరోపక్క ఆర్.ఆర్.ఆర్ అక్టోబర్ లో పోస్ట్ పోన్ అయితే మళ్ళీ సంక్రాంతి సీజన్ అంటున్నారు. నాగార్జునకి మాత్రం సంక్రాంతి సీజన్ తప్ప మరో సీజన్ లో బంగార్రాజు బంగారపు కలెక్షన్స్ తీసుకు వచ్చే ఛాన్స్ ఉండదు అనే ఉద్దేశ్యంతో నాగ్ ఈ సినిమా విషయంలో వెనకడుగు వేస్తున్నాడు.