పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కిన వకీల్ సాబ్ విడుదలకు సిద్దమవుతుంది. అయితే వకీల్ సాబ్ ప్రమోషన్స్ మొదలు పెట్టినప్పటినుండి కొన్ని విమర్శలు వస్తున్నాయి. హిందీ లో మంచి సినిమాగా పేరు తెచ్చుకుని విమర్శకుల ప్రశంశల సైతం పొందిన పింక్ రీమేక్ అనేది అసలు విమెన్ సెంట్రిక్ ఫిలిం. దానిని తమిళ్ లోకి రీమేక్ చేసినప్పుడు అజిత్ ఇమేజ్ మేరకు కొంచెం లిబర్టీ తీసుకున్నా.. అజిత్ కూడా ఆల్మోస్ట్ అమితాబ్ నే అనుకరించారు. ఆ సినిమాని అలానే ఉంచారు. కానీ తెలుగులోకి వచ్చేసరికి పింక్ రీమేక్ కథ మొత్తం వకీల్ సాబ్ చుట్టూనే తిరుగుతుంది.
హీరో సెంట్రిక్ ఫిలిం అయ్యిపోయింది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ చుట్టూ తిరుగుతుంది. టైటిల్ దగ్గరనుండి ఫస్ట్ లుక్ కానీ, వకీల్ సాబ్ పోస్టర్స్ కానీ, టీజర్ కానీ, సాంగ్స్ కానీ అన్ని కూడా హీరో మార్కెట్, బిజినెస్, ఆ సినిమా మీద హైప్ మొత్తం పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతుంది తప్ప.. సినిమా బేస్ జోన్ విమెన్ థింగ్ అనేది ఎస్టాబ్లిష్ చెయ్యడం లేదు. నిన్న మహిళా దినోత్సవం రోజున వచ్చిన వకీల్ సాబ్ పోస్టర్ కూడా అలానే ఉండడంతో కాస్త విమర్శలు వినిపించాయి. కానీ పవన్ కళ్యాణ్ ఫాన్స్ మామూలోళ్లు కాదు కదా.. ఇదిగో ఇటు చూడండి. అమితాబ్ పింక్ పోస్టర్ ని, పవన్ వకీల్ సాబ్ పోస్టర్ ని పక్కపక్కనబెట్టి ..
మీకు ప్రాబ్లెమ్ వస్తే మీ వెనుక నేనున్నాను అంటున్న అమితాబ్.. మీకే ప్రాబ్లెమ్ రాకుండా మీ ముందు నేనున్నాను అంటున్న మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అని దాన్ని కూడా పాజిటివ్ గా చేంజ్ చేసేసారు. కవర్ చేసేసారు ఆ మిస్టేక్ ని కూడా. కానీ ఇలాంటి కవర్ డ్రైవ్స్ ఎన్ని ప్లే చేసినా.. ఎంత ఫ్యానిజం చూపించినా ఫస్ట్ డే మార్నింగ్ షో పడే వరకే బాస్.. అక్కడితో తేలిపోతుంది ఆ సినిమా రిజల్ట్.