ఏపీలో విశాఖ ఉక్కు ఉద్యమం ఉదృతం రూపం దాలుస్తుంది. విశాఖలో స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయవద్దంటూ పెద్ద ఎత్తున పోరాటం చేపట్టారు. టిడిపి ఎమ్యెల్యే ఘంటా శ్రీనివాసరావు ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేసి.. విశాఖ ఉద్యమం కోసం పోరాడడం, వైసిపి ఎంపీలు, ఎమ్యెల్యే రోజాలాంటి నేతలు పాద యాత్ర చేపట్టడం, మార్చి 5 న ఉద్యమానికి మద్దతుగా ఏపీలో బంద్ చేపట్టడం లాంటి విషయాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రేవేటీకరణ ఉద్యమం ఉదృతం రూపం దాల్చిన విషయం తెలియందే. ఇక సినిమా పరిశ్రమ నుండి చిన్నగా విశాఖ ఉక్కు కి మద్దతు మొదలయ్యింది. అందులో సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తున్న వారికి తాను కూడా మద్దతు ప్రకటిస్తున్నానని సోషల్ మీడియా వేదికగా విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.
అప్పట్లో విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ దిక్కులు పిక్కటిల్లేలా మోగిన ఆనాటి నినాదాలు ఇంకా తన చెవుల్లో మారుమోగుతున్నాయని అని, ఆనాడు చదువుకునే రోజుల్లో బ్రష్ చేతపట్టి, గోడల మీద విశాఖ ఉక్కు సాధిస్తాం అనే నినాదాన్ని రాశామని చెబుతున్నారు చిరు.అప్పట్లోనే రాస్తారోకోలు, ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు చేశామని.. దాదాపు 35 మంది పౌరులతో పాటు ఒక తొమ్మిదేళ్ల బాలుడు కూడా ప్రాణార్పణ చేసిన ఆనాటి మహోద్యమ త్యాగాల ఫలితంగా సాకారమైన విశాఖ ఉక్కు కర్మాగారం ఉత్పత్తి ప్రారంభమైనప్పుడు అందరం సంబరాలు చేసుకున్నామని తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇన్ని సంవత్సరాలుగా క్యాప్టివ్ మైన్స్ కేటాయించకపోవడం దారుణమని, నష్టాలొస్తున్నాయనే సాకుతో ప్రైవేటు పరం చెయ్యాలని కేంద్రం అనుకోవడం సరికాదని, ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది ఆధారపడిన ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నాలను కేంద్రం మనుకోవాలంటూ.. కేంద్ర మరోసారి పునరాలోచించాలంటూ చిరు విశాఖ ఉక్కుని కాపాడుకోవడం మనందరి కర్తవ్యం అంటూ నినాదాన్నిచ్చారు చిరు.