Advertisementt

మళ్లీ మెగా హీరో పైనే మెనీ హోప్స్

Wed 10th Mar 2021 02:57 PM
vaishnav tej,uppena movie,rakul keratam movie,venkatadri express movie,rakul bollywood movies,krithi shetty,overnight star,rakul fate  మళ్లీ మెగా హీరో పైనే మెనీ హోప్స్
Many hopes on Mega Hero again మళ్లీ మెగా హీరో పైనే మెనీ హోప్స్
Advertisement
Ads by CJ

ప్రభాస్ కజిన్ సిద్ధార్థ్ రాజ్ కుమార్ ఫస్ట్ ఫిలిం కెరటం మూవీ తో తెరంగేట్రం చేసింది రకుల్ ప్రీత్. అయితే ఫస్ట్ సినిమా రకుల్ కి బ్రేక్ ఇవ్వలేదు. ప్రభాస్ సూపర్ హిట్ ఫిలిం మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో కూడా రకుల్ ని హీరోయిన్ గా పెట్టుకుని తీసేశారనే రిమార్క్ పడింది. అయితే ఒక్కసారిగా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో హిట్ కొట్టిన రకుల్ ప్రీత్ లైం లైట్ లోకి వచ్చింది. ఆ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకుంది. కెరీర్ లో నిలదొక్కుకుంది. మరీ ముఖ్యంగా మెగా హీరోల సినిమాలతో  తనకి మంచి హిట్స్ వచ్చాయి. బ్రూస్ లీ సినిమా ప్లాప్ అయినా మళ్ళీ రకుల్ ని ఎంకరేజ్ చేసిన రామ్ చరణ్ ధ్రువ సినిమాలో ఛాన్స్ ఇవ్వడమే కాదు.. ఆ సినిమాతో మంచి హిట్ ఇచ్చాడు. 

అల్లు అర్జున్ సరైనోడు సినిమాతో మంచి హిట్ ఇచ్చాడు. అలా సక్సెస్ బాట పట్టిన రకుల్ కి కంటిన్యూస్ గా స్ట్రోక్స్ తగిలాయి. లైక్ స్పైడర్ మూవీ, తమిళ్ లో ఎన్ జీకే, నాగ్ తో చేసిన మన్మధుడు 2 ఇలా రెండు మూడు సినిమాలతో స్ట్రోక్స్ తగిలాయి. చివరికి చెక్ సినిమాలోనూ రకుల్ ఇంపార్టెంట్ కేరెక్టర్ ప్లే చేసినా ఆ సినిమా కూడా రకుల్ కి కరెక్ట్ రిజల్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు కొత్తగా ఉప్పెన తో ఉప్పెనలా దూసుకొచ్చిన మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ మూవీలో క్రిష్ దర్శకత్వంలో నటించింది. ఆ సినిమాపైనే రకుల్ హోప్స్ ఉన్నాయి. ఆ సినిమాకి జంగిల్ బుక్ టైటిల్ అనుకుంటున్నారు. 

ఆ సినిమాపైనే రకుల్ చాలా హోప్స్ పెట్టుకుంది. బాలీవుడ్ లో అయితే రెండు సినిమాలతో బిజీగా వుంది. మిడిల్ లో ఈ డ్రగ్స్ కేసులు గొడవలు అంటూ కాస్త సఫర్ అయినా హిందీలో బిజీగానే ఉంది. ఇక్కడ తెలుగులో మాత్రం వైష్ణవ్ తేజ్ సినిమానే రకుల్ కి చివరి ఛాన్స్. ఉప్పెన సినిమాతో కృతి శెట్టి ని ఓవర్ నైట్ స్టార్ ని చేసేసిన వైష్ణవ్ తేజ్ కాంబినేషన్ రకుల్ కి కూడా కలిసొస్తుందా? రకుల్ ఫేట్ చేంజ్ అయ్యి లైం లైట్ లోకి వస్తుందా?

Many hopes on Mega Hero again:

Vaishnav Tej who made Krithi Shetty an overnight star also make Rakul one?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ