Advertisementt

శశి అంటే రెండక్షరాలు కాదు

Wed 10th Mar 2021 11:25 AM
aadi sai kumar,sashi movie,aadi sai kumar sashi movie,sashi movie trailer review,sashi movie review,surabhi,harsha,sashi movie rating,adi sashi,adi sai kumar  శశి అంటే రెండక్షరాలు కాదు
Sashi Movie Trailer released శశి అంటే రెండక్షరాలు కాదు
Advertisement
Ads by CJ

అది సాయి కుమార్ హీరోగా నిలదొక్కుకోవడానికి తంటాలు పడుతూనే చిన్నపాటి గ్యాప్ తో శశి అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వచ్చే శుక్రవారం అంటే మార్చ్ 19 న విడుదల కాబోతున్న శశి ట్రైలర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా లాంచ్ అయ్యింది. శశి టీజర్ ని మెగాస్టార్ చిరు చేతుల మీదుగా రిలీజ్ చేయించిన ఆది సాయి కుమార్ శశి ట్రైలర్ ని పవర్ స్టార్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. శశి ట్రైలర్ లో అది సాయి కుమార్ రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు. అమ్మాయి ప్రేమ కోసం, బెస్ట్ ఫ్రెండ్ కోసం ఏదైనా చేసేసే కుర్రాడిగా ఆది కనిపిస్తున్నాడు. 

మనం ప్రేమించినవాళ్ళు మన పక్కన ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా ఉంటుందో.. ప్రమాదంలో ఉన్నప్పుడూ అంతే భయంగా ఉంటుంది అంటూ సురభి గురించి ఆది సాయి కుమార్ చెప్పిన డైలాగ్ బావుంది. మనం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ముందు మన బలహీనతల్ని గెలవాలి. శశి అంటే రెండక్షరాలు కాదు.. వాడికి మనిద్దరం.. ఏ ఒక్కరు లేకపోయినా తట్టుకోలేడు అంటూ అది సాయి కుమార్ ఫ్రెండ్ సురభితో చెప్పే డైలాగ్ చూస్తుంటే ఎమోషనల్ గా అనిపిస్తుంది. ప్రేమంటే లేని చోట వెతుక్కోవడం కాదు.. ఉన్న చోట నిలబెట్టుకోవడం అంటూ సురభి చెప్పే డైలాగ్స్.. ప్రేమించిన వాడితో పెళ్లి చేయకుండా.. పెళ్లి చేసిన వాడితో ప్రేమగా ఉంటుందనుకోవడం మీ మూర్ఖత్వం.. అంటూ ఆది సాయి కుమార్ తండ్రితో చెప్పే డైలాగ్స్ అన్ని పవర్ ఫుల్ గాను, ప్రేమ గాను, ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నాయి. 

డైలాగ్స్ మాత్రమే కాదు యాక్షన్ సీక్వెన్స్ కూడా హైలెట్ అనేలా ఉన్నాయి. మరి ఎప్పటినుండో హిట్ కోసం ఎదురు చూస్తున్న ఆది సాయి కుమార్ శశి తో హిట్ కొట్టేలాగే కనబడుతున్నాడు ఈ ట్రైలర్ చూస్తుంటే.

Click here for Sashi Trailer

Sashi Movie Trailer released :

Aadi Sai Kumar Sashi Movie Trailer review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ