ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కన్నడ హీరో యశ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కెజిఎఫ్ పాన్ ఇండియా లెవల్లో సంచలనాలకు తెర లేపింది. కెజిఎఫ్ తర్వాత కెజిఎఫ్ 2 తో మరో మూడు నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న యశ్ కి కెజిఎఫ్ సినిమాతో వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ప్రస్తుతం కెజిఎఫ్ 2 షూటింగ్ లో ఉన్న యశ్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. యశ్ పోలీస్ స్టేషన్ కి వెళాల్సి రావడం ఇప్పుడు కన్నడ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.. అసలు యశ్ పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అంటే..
యశ్ హాసన్ జిల్లాలోని తిమ్లాపూర్ సమీపంలో కొంత భూమిని కొనుగోలు చేశాడు. ఆ స్థలంలో యశ్ ఫామ్ హౌస్ నిర్మించుకోవాలని ప్లాన్ చేశాడు. దానిలో భాగంగా యశ్ తల్లితండ్రులు యశ్ కోసం అక్కడ ఫారం హౌస్ నిర్మించడానికి గాను రోడ్ వేయించే క్రమంలో గ్రామస్తులు కొంతమంది యశ్ తల్లి తండ్రులతో గొడవలకు దిగగా.. చిన్నగా మొదలైన ఆ గొడవ చివరికి పెద్దదిగా మారడంతో హుటాహుటిన అక్కడికి వచ్చిన యశ్ గ్రామస్తులతో వాగ్వాదానికి దిగడంతో గొడవ పెద్దదై పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. ఇక యశ్ కారుని గ్రామస్తులు చుట్టూ ముట్టి నానా గొడవ చేసారు.
తర్వాత యశ్ మీడియా తో మట్లాడుతూ.. తాను హసన్ జిల్లాలోనే పుట్టానని, ఇక్కడ పొలం కొని ఏమైనా చెయ్యాలనే కలతో ఇళ్లు కడుతున్నా అని.. అందులో భాగంగా పని చేస్తున్న వారిపై గ్రామస్తులు గొడవకి దిగారని, వారితో మా తలితండ్రులు మాట్లాడినా పరిస్థితి అదుపులోకి రాలేదు సరికదా.. పని చేసే వారిపై గ్రామస్తులు దాడి చేసారంటూ యశ్ ఆరోపిస్తున్నాడు.