Advertisementt

బ్రేకింగ్ :బాలీవుడ్ మూవీలో మెగాస్టార్.!

Tue 09th Mar 2021 10:32 PM
chiranjeevi,amitabh bachchan,sye raa movie,guest role,balakrishna,krishna vamsi,raithu movie,chiru entry in bollywood movie  బ్రేకింగ్ :బాలీవుడ్ మూవీలో మెగాస్టార్.!
Megastar in Bollywood movie.! బ్రేకింగ్ :బాలీవుడ్ మూవీలో మెగాస్టార్.!
Advertisement
Ads by CJ

సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో సై రా సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేసిన చిరంజీవి ఆ సినిమా కోసం అడగ్గానే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ చిరు కి గురువు పాత్ర చేసారు. చిరు సై రా సినిమాలో అమితాబచ్చన్ ఓ గెస్ట్ రోల్ చేయడంపై అప్పుడు కూడా కాస్త కాంట్రవర్సీ జరిగింది. అంతకుముందే బాలకృష్ణ - దర్శకుడు కృష్ణవంశీలు రైతు అనే సినిమాలో అమితాబచ్చన్ ని రాష్ట్రపతి కేరెక్టర్ కోసం సంప్రదించగా దానిని రిజెక్ట్ చేసిన అమితాబ్ చిరు అడగ్గానే సై రా లో నటించడాన్ని నందమూరి ఫాన్స్ ని హార్ట్ చేసింది. అప్పట్లో అమితాబ్ పై నందమూరి ఫాన్స్ గుర్రుగా వున్నారు. అంతేకాదు ట్రోల్స్ కూడా జరిగాయి. సోషల్ మీడియాలో ఫాన్స్ వార్ కూడా జరిగాయి.

ఏదేమైనా చిరంజీవి - అమితాబచ్చన్ కి మధ్యన ఉన్న రిలేషన్ అలాంటిది. చిరంజీవి అడగ్గానే వచ్చి చేసిన అమితాబచ్చన్.. ఈరోజు అదే చిరంజీవి ని ఓ పర్టిక్యులర్ సినిమా లో ఓ కేరెక్టర్ కోసం అమితాబ్ ఇన్వైట్ చేసినట్టుగా తెలుస్తుంది. అమితాబ్ అడగడమే ఆలస్యం అన్నట్టు.. కాదనలేని చిరంజీవి ఇమ్మిడియట్ గా బాలీవుడ్ మూవీ లో నటించడానికి అంగీకారం తెలిపినట్లుగా వినికిడి. ఈ సినిమాకి సంబందించిన మిగిలిన వివరాలు బయటికి రావడానికి ఒక నెల పైనే టైం పడుతుంది. కానీ రావడం తథ్యం.

Megastar in Bollywood movie.!:

Chiru guest role in Amitabh movie?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ