అర్జున్ రెడ్డి టైటిల్ నుండి మొదలైంది ఈ పైత్యం. తెలుగు సినిమా టైటిల్ పెట్టినా కూడా దాన్ని తెలుగు ఫాంట్ లో మాత్రం ప్రదర్శించలేకపోతున్నారు. అర్జున్ రెడ్డి టైటిల్ ని ఇంగ్లీష్ లో తప్ప తెలుగులో ఎక్కడా ప్రొజెక్ట్ చెయ్యలేదు. ఇప్పుడు ఇదే లిస్ట్ లో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా ఫిలిం లైగర్, నాగార్జున వైల్డ్ డాగ్, ప్రభాస్ సలార్, కన్నడ కెజిఎఫ్ (తెలుగులో కూడా సేమ్ టైటిల్) లాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. విజయ్ దేవరకొండ లైగర్ పాన్ ఇండియా ఫిలిం ని ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అన్ని భాషల్లో లైగర్ టైటిల్ ని పెట్టిన పూరి జగన్నాధ్ లైగర్ తెలుగు టైటిల్ పెట్టలేదు.
అలాగే నాగార్జున వైల్డ్ డాగ్ కూడా తెలుగులో టైటిల్ లేదు. జస్ట్ వైల్డ్ డాగ్ అంటూ ఇంగ్లీష్ టైటిల్ తప్ప. ఇక ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న సలార్ కూడా దేశంలోని పలు భాషల్లో రిలీజ్ కాబోతుంది. సలార్ కి కూడా తెలుగు టైటిల్ లేదు. అన్ని భాషల్లో సలార్ టైటిల్ వేసినా తెలుగులో మాత్రం టైటిల్ వెయ్యడానికి లేదు. మరి తెలుగులో మొదలైన సినిమాలకి, టాలీవుడ్ ప్రధానంగా తెరకెక్కుతున్న సినిమాలకి ఇలా ఇంగ్లీష్ టైటిల్ గోలేమిటో అర్ధం కావడం లేదు. ప్రేక్షకులకి ఏ టైటిల్ అయినా ఈజీగానే రీచ్ అవుతుంది. కానీ అదే టైటిల్ తెలుగు ఫాంట్ లో కూడా వస్తే బావుండేది అనే అభిప్రాయం చాలామందిలో ఉంది.